‘నిన్నిలా నిన్నిలా’ అంటూ రీతూకు చుక్కలు చూపెడుతున్న నిత్యా

టాలీవుడ్ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ ఇటీవల స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది.తమిళంలో చేసిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుండటంతో ఇక్కడి ప్రేక్షకులు ఆమెను మిస్ అవుతూ వచ్చారు.

 Nithya Menen Ritu Verma Ninnila Ninnila First Look Out, Nithya Menen, Ritu Verma-TeluguStop.com

అయితే తాజాగా నిత్యామీనన్ నటిస్తున్న ఓ స్ట్రెయిట్ మూవీకి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో మరో బ్యూటీ రీతూ వర్మ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ ఇద్దరు బ్యూటీలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.శశి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘నిన్నిలా నిన్నిలా’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

ఈ సినిమాలో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఒక డైనింగ్ టేబల్‌పై ఉన్న ప్లేట్లలో ఈ సినిమా హీరో హీరోయిన్ల తలలు ఉండటంతో ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

చాలా రోజుల తరువాత నిత్యా మీనన్ నుండి స్ట్రెయిట్ తెలుగు చిత్రం వస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు.

ఇక ఈ సినిమాకు రాజేష్ మురుగేసన్ సంగీతం అందిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా, ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనే అంశాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

మరి ఈ బ్యూటీ ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే ఈ సినిమా థియేటర్లలో బొమ్మ పడే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube