భారీ బయోపిక్‌ను రిజెక్ట్ చేసిన బ్యూటీ.. ఎవరో తెలుసా?  

Nithya Menen Rejects Karanam Malleswari Biopic - Telugu Biopic, Karanam Malleswari, Kona Venkat, Nithya Menen

టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా బయోపిక్ చిత్రాలను తెరకెక్కిస్తూ దర్శకనిర్మాతలు దూసుకుపోతున్నారు.అలనాటి లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ మహానటి, నందమూరి తారక రామారావు బయోపిక్ ఎన్టీఆర్, మల్లేశం వంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తి సక్సె్స్ అయ్యాయి.

 Nithya Menen Rejects Karanam Malleswari Biopic

ఈ సినిమాల్లో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు రావడమే కాకుండా పల అవార్డులు కూడా దక్కించుకున్నారు.కాగా ఇప్పుడు ఓ భారీ మల్టీస్టారర్ మూవీలో నటించే ఛాన్స్‌ను అందాల భామ నిత్యా మీనన్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

భారతదేశానికి ఒలింపిక్స్ క్రీడల్లో తొలి గోల్డ్ మెడల్‌ను అందించిన మహిళా క్రీడాకారిణీ కరణం మళ్లీశ్వరి జీవితగాధను కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో సంజనా రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తు్న్నారు.పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న చిత్ర యూనిట్, ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించేందుకు తొలుత అందాల భామ నిత్యా మీనన్ చెంతకు చేరింది.

భారీ బయోపిక్‌ను రిజెక్ట్ చేసిన బ్యూటీ.. ఎవరో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఆమె ఈ సినిమాలో నటించనని చెప్పి రిజెక్ట్ చేసింది.ఇలాంటి భారీ బయోపిక్ చిత్రంలో నటించే ఛాన్స్‌ను ఆమె రిజెక్ట్ చేయడంతో చిత్ర యూనిట్, ఈ సినిమాలో మరో హీరోయిన్‌ను తీసుకునేందుకు రెడీ అయ్యారు.

అయితే తాప్సీ పన్ను, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ల పేర్లు ఈ సినిమా కోసం ముఖ్యంగా వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాను ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా కరణం మళ్లేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithya Menen Rejects Karanam Malleswari Biopic Related Telugu News,Photos/Pics,Images..

footer-test