స్టార్ యాక్టర్‌తో చుక్కలు చూపిస్తానంటోన్న బ్యూటీ  

Nithya Menen Next Movie With Vijay Sethupathi, Nithya Menen, Vijay Sethupathi, 800, Breathe, Kollywood News - Telugu @menennithya, Breathe, Kollywood News, Nithya Menen, Vijay Sethupathi

టాలీవుడ్‌లో ‘అలా మొదలైంది’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దుబ్యూటీ నిత్యా మీనన్, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.హోమ్లీ బ్యూటీగా ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత తమిళంలో వరుసబెట్టి సినిమాలు చేస్తూ, టాలీవుడ్‌కు దూరమయ్యింది.

TeluguStop.com - Nithya Menen Next Movie With Vijay Sethupathi

అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం కోలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందనేది వాస్తవం.కాగా మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా బోల్డ్ పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిత్యా మీనన్, ప్రస్తుతం కోలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారింది.

ఇటీవల ‘బ్రీత్’ అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించిన నిత్యా మీనన్, ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్టులో నటించేందుకు రెడీ అయ్యింది.తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రంలో ఆయనకు జోడీగా నిత్యా మీనన్ ఎంపికయ్యింది.

TeluguStop.com - స్టార్ యాక్టర్‌తో చుక్కలు చూపిస్తానంటోన్న బ్యూటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాను అన్ని దక్షిణ భారత భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాలో నిత్యా మీనన్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇక విజయ్ సేతుపతి చిత్రం అంటే అక్కడ ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరి ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో నిత్యా చేయబోయే పాత్ర ఎలా ఉంటుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

కాగా నిత్యా మీనన్ ఈ సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.అయితే తెలుగు చిత్రాల్లో ఈ బ్యూటీ, ఇటీవల కనిపించడమే మానేసింది.

దీంతో ఆమె తెలుగులో తిరిగి ఎప్పుడు నటిస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఏదేమైనా నిత్యా మీనన్ తెలుగులో సినిమాలు చేయాలని చాలా మంది కోరుకుంటుండటంతో ఆమె ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

#Breathe #@MenenNithya #Nithya Menen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithya Menen Next Movie With Vijay Sethupathi Related Telugu News,Photos/Pics,Images..