అందాల ఆరబోతకు మాత్రమే కాకుండా నటనకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్స్ లో ఒకరు నిత్యామీనన్( Nithya Menen ).మలయాళం బాలనటిగా వెండితెర అరంగేట్రం చేసి, ఆ తర్వాత పెద్దయ్యాక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి, మన తెలుగు ఆడియన్స్ కి ‘ఆలా మొదలైంది’ అనే చిత్రం ద్వారా పరిచయమైంది.
ఈమెలో ఉన్న విశేషం ఏమిటంటే ‘ఆలా మొదలైంది( Ala Modalaind )’ సినిమా సమయానికి ఈమెకు అసలు తెలుగు బాషా రాదు.అయినా కూడా నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పింది.
క్యూట్ గొంతు తో ఆమె పలికే డైలాగ్స్ కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.ఆమెకి యూత్ లో క్రేజ్ ఎంతలా పెరిగినా కూడా, కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషించేది.
ఇప్పటి వరకు ఆమె కెరీర్ అలాగే సాగింది,పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా నటించడానికి ఒప్పుకోదు.ఈ కాలం లో ఇలాంటి హీరోయిన్స్ దొరకడం చాలా కష్టం.

ఇప్పటి వరకు ఈమె అన్నీ ప్రాంతీయ బాషా సినిమాల్లో నటించింది.కానీ ఎక్కడ ఎదురుకాని పరిస్థితులు మాత్రం తమిళ సినిమా ఇండస్ట్రీ నుండే ఎదురైంది.అక్కడ నిత్యామీనన్ ని ఒక స్టార్ హీరో ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ లైంగికంగా టార్చర్ చేసారంటూ నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది.తమిళ సినిమా ఇండస్ట్రీ లో పని చేస్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదురుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
నిత్యా మీనన్ ఇప్పటి వరకు తమిళం లో విజయ్ తో ‘మెర్సల్’ , ధనుష్ తో ‘తిరుచిత్రంబలం‘, దుల్కర్ సాల్మన్ తో ‘ఓకే కన్మణి‘ , విక్రమ్ తో ‘ఇరుముగన్’ మరియు సూర్య తో ‘24′ వంటి సినిమాలు చేసింది.ఈ 5 మంది హీరోలలో ఎవరో ఒకరు అయ్యే ఛాన్స్ ఉంది.
విజయ్ ఛాన్స్ లేదు, ధనుష్ ఎక్కువగా హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపాడు కాబట్టి కాసేపు ఆయనే అలాంటి వేధింపులకు గురి చేసాడని అనుకుందాం.

కానీ రీసెంట్ గానే వీళ్ళు ‘తిరుచిత్రంబలం ‘ మూవీ యూనిట్ రీ యూనియన్ అప్పుడు అందరూ కలుసుకున్నారు.కలిసి సంతోషంగా ఫోటోలు దిగారు కూడా.కాబట్టి ధనుష్ కూడా అయ్యే ఛాన్స్ ( Dhanush )లేదు, మరి ఎవరు అయ్యుంటారబ్బా అంటూ నెటిజెన్స్ బుర్రలు బద్దలుకొట్టుకొని మరీ ఆలోచిస్తున్నారు.
ప్రసుతం ఆమె ధనుష్ 50 వ చిత్రం లో నటించబోతుంది.తెలుగు లో ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘భీమ్లా నాయక్‘.పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.