పవన్ మూవీలో నిత్యా.. అధికారికంగా ప్రకటన !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో వెండితెరపై కనిపించారు.పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.

 Nithya Menen Joins The Sets Of Pawan Kalyans Next-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే 40 శాతం పైనే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది.

ఇప్పటికే విడుదల ఆయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

 Nithya Menen Joins The Sets Of Pawan Kalyans Next-పవన్ మూవీలో నిత్యా.. అధికారికంగా ప్రకటన -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియం అనే మలయాళ రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా ప్రధాన నటిస్తున్నాడు.ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో జరుగుతుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి హీరోయిన్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది.

ముందుగా పవన్ కు జోడీగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి ని తీసుకున్నారు.అయితే ఈ అమ్మడికి డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఈ సినిమా నుండి తప్పుకుంది.ఆ తర్వాత నిత్యా మీనన్ పేరు బాగా వినిపించింది.అయితే ఇంత వరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.తాజాగా ఈ రోజు ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరో అధికారికంగా ప్రకటించారు.

మొన్నటి వరకు వస్తున్నా రూమర్స్ ను నిజం చేస్తూ నిత్యా మీనన్ ను పవన్ కు జోడీగా తీసుకుంటున్నామని అధికారికంగా మేకర్స్ ప్రకటన చేసారు.మొదటిసారి పవన్ కు జోడీగా నిత్యా కనిపించ బోవడంతో ప్రేక్షకులు మంచి ఆసక్తితో ఉన్నారు.రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటించ బోతుందని ఇప్పటికే ప్రకటించారు.

ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తుండగా.సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

https://twitter.com/SitharaEnts/status/1420965128216846336/photo/1
#Rana #Pawan Kalyan #Nithya Menon #NithyaMenen #DirectorSagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు