ఐదు రూపాయలు కూడా లేని ముఖ్యమంత్రి

ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు… ఆయన వెంట ఐఏఎస్ లు ఉన్నారు.అంతా కలిసి బస్సెక్కారు.ముందు సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రికి కండక్టర్ టికెట్ ఇచ్చి డబ్బులు అడిగారు… ఆయన జేబులన్నీ తడుముకున్నా ఏమీ దొరకలేదు… తన వెనుక ఉన్న ఐఏఎస్ ను రూ.5 అప్పు అడిగారు… ఆ డబ్బులతో టికెట్ కొన్నారు.వినడానికి తమాషాగా ఉన్నా ఇది నిజం….ఈ సరదా సంఘటన బీహార్ లోజరిగింది.అధికారికంగా బస్ స్టేషన్ ను ప్రారంభించిన సందర్బంలో ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కు ఎదురైన అనుభవం ఇది.పాట్నాలో బుధవారం లోకల్ బస్ సేవలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నితీష్కుమార్ గాంధీ మైదాన్ నుంచి పాట్నా స్టేషన్ వరకు వెళ్లే బస్సులో ఎక్కి కూర్చున్నారు.మొదటి ప్రయాణికుడు సీఎం కావడంతో ఆ బస్సు కండక్టర్ టికెట్ కొట్టింది.జేబులో డబ్బులు లేకపోవడంతో ముఖ్యమంత్రి నితీష్.తన వెంట ఉన్న అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ లాల్ మీనా వద్ద ఐదు రూపాయలు అడిగి తీసుకున్నారు.అనంతరం నిర్వహించిన సభలో నితీష్ మాట్లాడుతూ ‘ఇవాళ ఓ అధికారి నా జీవితాన్ని కాపాడాడు’.‘ఒకటో తేదీన జీతం పడగానే ఐదు రూపాయలు తిరిగిచ్చేస్తానని’ బస్సులో జరిగిన విషయంపై సరదా చెప్పారు.

 Nithish Kumar Borrows 5 Rs-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube