కాలినడకన తిరుపతి వెళ్లిన హీరో నితిన్... అభిమానుల ఉత్సాహం

మన సెలబ్రెటీలు రెగ్యులర్ గా తిరుపతి దర్శనానికి వెళ్తూ ఉంటారు.సినిమా రిలీజ్ కి ముందు, రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత తిరుమల వెళ్లి శ్రీనివాసుడుని దర్శించుకుంటారు.

 Nithin Went To Tirupati By Walk-TeluguStop.com

చాలా మందికి తిరుపతి వెంకన్నపై భక్తి భావం ప్రదర్శిస్తూ ఉంటారు.ఒక్కోసారి సెలబ్రెటీలు కాలినడకన కూడా తిరుమల కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.

ఇలా దర్శించుకునే సమయంలో భక్తులు తమ అభిమాన హీరోలని, హీరోయిన్స్ ని చూసిన ఆనందంలో సెల్ఫీలు తీసుకుంటారు.వారు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా భక్తులతో ఫోటోలు దిగుతూ ఉంటారు.

 Nithin Went To Tirupati By Walk-కాలినడకన తిరుపతి వెళ్లిన హీరో నితిన్… అభిమానుల ఉత్సాహం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా యూత్ స్టార్ నితిన్ తన భార్యతో కలిసి తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లారు.పెళ్లి తర్వాత వరుసగా సినిమా షూటింగ్ లతో నితిన్ బిజీ అయిపోయాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా షూటింగ్ తో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ సినిమాలని పూర్తి చేశాడు.ఈ రెండు సినిమాలు ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ షూటింగ్ లో ఉన్నాడు.అయితే పెళ్లి తర్వాత మన భార్యాభర్తలు జంటలు తిరుమల దర్శించుకోవడం మన తెలుగు రాష్ట్రాలలో ఆనవాయితీగా వస్తుంది.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఫ్రీ టైం దొరకడంతో నితిన్ భార్యతో కలిసి తిరుమలకి వెళ్లారు.ఈ నేపధ్యంలో ఫ్యామిలీని ముందుగా పంపించేసి తాను మాత్రం కాలినడకన కొండపైకి వెళ్లారు.

నడకదారి మార్గంలో నితిన్ ని చూసిన అభిమానులు అతనితో ఫోటోలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు.అలా ఓ అభిమాని ఫోటో తీసి దానిని ట్విట్టర్ లో షేర్ చేయగా నితిన్ కూడా దానిని రీట్వీట్ చేశాడు.

.

#Rang De Movie #Hero Nithin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు