'చెక్‌' విడుదలకు కొన్ని గంటల ముందు పెద్ద నిజం చెప్పేశారు

హీరో నితిన్ గత ఏడాది భీష్మ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Nithin Priya Prakash Wariyar Movie Check Climax Interesting Update-TeluguStop.com

ఆ సినిమా విడుదల అయిన వెంటనే గత ఏడాది సమ్మర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న రంగ్‌ దే సినిమాను నితిన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది.కాని కరోనా కారణంగా రంగ్‌ దే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇప్పటికే రంగ్‌ దే పూర్తి అయ్యింది.కాని విడుదల విషయంలో జాప్యం చేస్తూ వచ్చారు.

 Nithin Priya Prakash Wariyar Movie Check Climax Interesting Update-చెక్‌’ విడుదలకు కొన్ని గంటల ముందు పెద్ద నిజం చెప్పేశారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రేక్షకులు అంతా కూడా రంగ్‌ దే కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో అనూహ్యంగా చంద్ర శేఖర్‌ యేలెటి దర్శకత్వంలో నితిన్ నటించిన చెక్‌ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.చెక్ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఉరి శిక్ష పడ్డ ఖైదీ కథ తో ఈ సినిమా ను రూపొందించారు.

నితిన్‌ ఉరి శిక్ష పడ్డ ఖైదీగా మెప్పించాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు, రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు అనఫిషియల్‌గా ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించి లీక్ ఇచ్చారు.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న గుసగుసల ప్రకారం తెలుగు ప్రేక్షకులకు నచ్చని విధంగా క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు.

అంటే యాంటీ క్లైమాక్స్ తో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.నేనే రాజు నేనే మంత్రి తరహా లో ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న చెక్ సినిమా క్లైమాక్స్‌ యాంటీ క్లైమాక్స్‌ అయితే ఖచ్చితంగా ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చెప్పలేని పరిస్థితి.ఈమద్య కాలంలో తెలుగు ప్రేక్షకులు కూడా యాంటీ క్లైమాక్స్ కు అలవాటు పడ్డారు.

అందుకే చంద్ర శేఖర్‌ యేలేటి ఈ సినిమా లో యాంటీ క్లైమాక్స్ ను ప్లాన్‌ చేశాడని అంటున్నారు.ఈ సినిమాలో నితిన్ కు జోడీగా ప్రియా ప్రకాష్ వారియర్‌ నటించగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ కీలక పాత్రలో కనిపించబోతుంది.

.

#PriyaPrakash #Anti Climax #Leaked #Climax #NitinCheck

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు