చంద్రశేఖర్ ఏలేటిని చెక్ చేసుకుంటున్న నితిన్

యంగ్ హీరో నితిన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.దీంతో అతని కథలు అన్ని రొటీన్ గా ఒకే మూసలో ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 Nithin Next Movie Title Is A Check-TeluguStop.com

ప్రస్తుతం వెంకి కుడుముల దర్శకత్వంలో భీష్మా సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమా లవ్ ఎంటర్టైనర్ గానే ఉండబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నితిన్ నెక్స్ట్ సినిమాని కాస్తా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది.

విభిన్న చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి.

ఈ దర్శకుడు చెప్పిన కథకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.భీష్మా రిలీజ్ తర్వాత ఇతని సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన టైటిల్ వినిపిస్తుంది.చెక్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు టాక్.

చదరంగం ఆటలో ప్రత్యర్ధి ఆటగాడికి ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ చెక్ అనే మాటని ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ నేపధ్యంలో ఈ సినిమా కూడా చంద్రశేఖర్ గత సినిమాల తరహాలోనే స్క్రీన్ ప్లే ప్రధానంగా హీరో, విలన్ ల మధ్య ఎత్తులు పై ఎత్తులతో ఉంటుందని తెలుస్తుంది.

ఈ కారణంగానే సినిమాకి చెక్ అనే టైటిల్ ని పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube