మళ్ళీ షూటింగ్ షురూ చేసిన నితిన్.. మళ్ళీ హిట్ కొడతాడా..?  

nithin new movie check shooting schedule begins,Nithin new movie check shooting schedule begins, @bhavyacreationsofficial ⁦@rakulpreet #priyavarrier,  Nithin, check shooting schedule,  - Telugu @actor_nithiin, @bhavyacreationsofficial, #priyavarrier, Check Movie Update, Check Shooting Schedule, Nithin, Nithin New Movie Check Shooting Schedule Begins, ⁦@rakulpreet

తెలుగులో ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ “చెక్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు వింక్  గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

TeluguStop.com - Nithin New Movie Check Shooting Schedule Begins

 కాగా ఈ చిత్రానికి కి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీత స్వరాలను సమకూరుస్తున్నాడు.అయితే గత కొద్ది కాలంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కొంతకాలం పాటు తాత్కాలికంగా చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పనులను నిలిపి వేశారు.

అయితే ఈ రోజు ఈ చిత్ర షూటింగ్ పనులను మళ్లీ మొదలు పెట్టినట్లు హీరో నితిన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు.దీంతో నితిన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

TeluguStop.com - మళ్ళీ షూటింగ్ షురూ చేసిన నితిన్.. మళ్ళీ హిట్ కొడతాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాక గతంలో నితిన్ హీరోగా నటించినటువంటి భీష్మ అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. కానీ కరోనా కలకలం  సృష్టించగా థియేటర్లు మూసివేయడంతో కలెక్షన్లకి గండి పడింది.

అయినప్పటికీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న “రంగ్ దే” అనే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

 ఈ చిత్రంలో హీరోయిన్ గా మహానటి మూవీ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.దీంతో ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

#CheckShooting ##priyavarrier #NithinNew #Nithin #⁦@rakulpreet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithin New Movie Check Shooting Schedule Begins Related Telugu News,Photos/Pics,Images..