కరోనా వైరస్‌కు భయపడని నితిన్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో నితిన్ తనదైన మార్క్‌ను వేసుకున్నాడు.

 Nithin Movie To Have Hollywood Makeup Artist, Nithin, Rang De, Andhadhun Remake,-TeluguStop.com

కాగా ఈ సినిమాతో అదిరిపోయే సక్సె్స్ అందుకున్న నితిన్, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు.ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టిన ఈ సినిమాకు రంగ్‌దే అనే టైటిల్‌ను పెట్టాడు.

అయితే ఈ సినిమా తరువాత నితిన్ మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’కు తెలుగు రీమేక్ చిత్రాన్ని రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అటు మరో డైరెక్టర్ కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ అనే సినిమాను కూడా రెడీ చేయనున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలో నితిన్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో మనకు కనిపిస్తాడట.ఇందులో నితిన్ 20 ఏళ్ల యువకుడిగా, 40 ఏళ్ల వయస్కుడిగా, 60 ఏళ్ల వృద్ధుడిగా మనకు కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ పాత్రల్లో నితిన్‌ను మనకు చూపించనున్న చిత్ర యూనిట్, అందుకోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్‌ను తీసుకోనున్నారు.నితిన్ ఈ మూడు పాత్రల్లో జీవించేలా మనకు చూపించనున్నారు చిత్ర యూనిట్.

మొత్తానికి ఈ సినిమాలో నితిన్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube