ఈ ఏడాదిలో నితిన్ కు అరుదైన రికార్డు దక్కబోతుంది!

కరోనా కారణంగా ఈ ఏడాదిలో పెద్ద హీరోల సినిమాలు వచ్చిందే లేదు.గత ఏడాది కాలంగా టాలీవుడ్ లో స్టార్‌ హీరోల సినిమాలు అంటే పవన్‌ కళ్యాన్‌ వకీల్‌ సాబ్‌ మినహా మరే సినిమా విడుదల అవ్వలేదు.

 Nithin Movie Maestro Release Date Coming Soon-TeluguStop.com

స్టార్‌ హీరోలు అంతా కూడా సైలెంట్‌ గా ఉన్నారు.ఇక కొందరు యంగ్ హీరోలు కూడా గత ఏడాది కాలంగా ఖాళీగా లేకున్నా కూడా తమ సినిమా లను విడుదల చేయడం లో విఫలం అయ్యారు.

కాని యంగ్ హీరో నితిన్‌ మాత్రం గత ఏడాది భీష్మ సినిమా ను విడుదల చేసి ఈ ఏడాది ఇప్పటికే చెక్‌ మరియు రంగ్‌ దే సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.ఆ సినిమా ల్లో చెక్‌ నిరాశ పర్చగా రంగ్‌ దే సినిమా కు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది.

 Nithin Movie Maestro Release Date Coming Soon-ఈ ఏడాదిలో నితిన్ కు అరుదైన రికార్డు దక్కబోతుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కీర్తి సురేష్ హీరోయిన్‌ గా నటించిన రంగ్ దే సినిమా లో నితిన్ నటన ఆకట్టుకునే విధంగా ఉందంటూ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.ఇక నితిన్ మరో సినిమా తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తాడని క్లారిటీ వచ్చేసింది.

బాలీవుడ్‌ హిట్‌ మూవీ అంధాదున్‌ రీమేక్ మాస్ట్రో లో నితిన్ నటించాడు.మేర్ల పాక గాంధీ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో నితిన్‌ కు జోడీగా నభా నటేష్‌ నటించింది.ఈ సినిమాలోని కీలక పాత్రను తమన్నా చేయడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.ఒరిజినల్‌ వర్షన్ అంధాదున్‌ లో టబు పోషించిన ఆ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.

నటనకు ఆస్కారం ఉన్న ఆ పాత్రను ఇప్పుడు తమన్నా చేయడం వల్ల ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ ను సెకండ్‌ వేవ్‌ తర్వాత మొదలు పెడుతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు.

ఇంతలోనే సినిమా ను ముగించినట్లుగా ప్రకటించారు.ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వడంతో సినిమా ఇదే ఏడాదిలో వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

ఈ ఏడాదిలో మాస్ట్రో సినిమా కూడా విడుదల అయితే నితిన్‌ కు 2021 చాలా స్పెషల్‌ గా నిలుస్తుంది.ఇతర హీరోలు కనీసం ఒక్క సినిమా విడుదల చేయలేక పోయిన ఈ ఏడాది నితిన్ మాత్రం మూడు సినిమా లను విడుదల చేసిన రికార్డు అరుదైన ఘనత దక్కబోతుందని నెటిజన్స్ అంటున్నారు.

#MaestroShooting #Nitin #NithinMaestro #NithinBack #MaestroRelease

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు