నితిన్ పెళ్లి కానుక... వినోదాత్మకంగా రంగ్ దే టీజర్

యంగ్ హీరో నితిన్ నిన్న రాత్రి షాలినిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు.కొత్తజీవితంలోకి అడుగుపెట్టాడు.

 Rang De Makers Wish Nithiin A Happy Married Life With Adorable Teaser, Keerthi S-TeluguStop.com

ఇక నితిన్ పెళ్లి కానుకగా రంగ్ దే టీంఅతనికి మంచి సినిమా టీజర్ తో ట్రీట్ ఇచ్చింది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది.

ఈ నేపధ్యంలో ఎలాగూ టీజర్ రిలీజ్ చేయాలి కాబట్టి ముందుగానే నితిన్ పెళ్లి కానుకగా అందించారు.తాజాగా ఈ టీజర్ తో రంగ్ దే టీం నితిన్ కి పెళ్లి శుభాకాంక్షలందజేసింది.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.ఇక ఈ టీజర్ విషయానికి వస్తే నితిన్ గత సినిమాలలో మాదిరిగానే‌ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.

తండ్రి కోరిక మేరకు నితిన్ కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకున్నట్లు చూపించారు.అర్జున్‌ ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్‌ దృష్ట్యా అనుని నువ్వు పెళ్లి చేసుకోవడమే నాకు న్యాయం అనిపిస్తోంది అంటూ సీనియర్‌ నరేష్‌ నితిన్‌ భుజం మీద చేయి వేయగా చేయి తియ్‌ జస్టిస్‌ చౌదరి అని నితిన్‌ కౌంటర్‌ ఇవ్వడం నవ్వుల్ని పంచుతోంది.

కీర్తి సురేష్‌ మెడలో తాళికట్టే సందర్భంలో నాన్నా నవ్వుతోంది నేను కట్టలేను నాన్నా అని నితిన్‌ చెప్పే సంభాషణతో టీజర్‌ సరదాగా ముగిసింది.ఫుల్ ఎంటర్టైనర్ గా లైట్ గా మాస్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ, లవ్ స్టోరీని నడిపిస్తూ ఫ్యామిలీ అనుబంధాల నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఇది కనిపిస్తుంది.

ఈ సినిమాతో నితిన్ ని మరో హిట్ పడేలా ఉంది.ఇక సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube