ఆగస్టు 15 నుండి ఓటిటీ లో స్ట్రీమింగ్ కానున్న మాస్ట్రో !

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు.నితిన్ గత సంవత్సరం విడుదలైన భీష్మ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

 Nithin Maestro Movie Streaming On August 15-TeluguStop.com

ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలో లైన్లో పెట్టాడు.అయితే ఆ సినిమా ఇచ్చినంత సక్సెస్ మరొక సినిమా ఇవ్వలేక పోయింది.

అయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

 Nithin Maestro Movie Streaming On August 15-ఆగస్టు 15 నుండి ఓటిటీ లో స్ట్రీమింగ్ కానున్న మాస్ట్రో -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నితిన్ రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంటే తమన్నా కీలక పాత్రలో కనిపిస్తుంది.ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటిటీ లోనే విడుదల చేయాలనీ ఇప్పటికే చిత్ర యూనిట్ అనుకుంటుంది.

ఇప్పటికే ప్రముఖ ఓటిటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా ను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతుందని తెలుస్తుంది.ఈ సినిమా ఆగస్టు 15 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానున్నట్టు సమాచారం.

ఈ సినిమాను రాజ్ కుమార్ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.

#Maestro #Disney Hot #Nithin #Nithin Maestro

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు