మాస్ట్రో మూవీ రివ్యూ మరియు రేటింగ్

హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అంధాధూన్ కు రీమేక్ గా తెలుగులో మాస్ట్రో సినిమా తెరకెక్కి ఈరోజు డిస్నీ + హాట్ స్టార్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

చెక్, రంగ్ దే సినిమాల ఫలితాలు నితిన్ కు షాకివ్వగా ఓటీటీలో విడుదలైన మాస్ట్రో సినిమా మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.అరుణ్(నితిన్) కళ్లు లేనివాళ్లకు ఫోకస్ ఎక్కువని నమ్మి తనకు కళ్లు ఉన్నా కళ్లు లేవని చెబుతూ పియానో ప్లేయర్ గా చలామణి అవుతాడు.

కళ్లు లేవని తెలిసినా సోఫీ(నభా నటేష్) అరుణ్ ను ప్రేమిస్తుంది.మోహన్( సీనియర్ నరేష్) అరుణ్ కు పెద్ద ఫ్యాన్ కావడంతో భార్య సిమ్రాన్(తమన్నా)కు మ్యారేజ్ ఆనివర్సరీ రోజున అరుణ్ తో మ్యూజిక్ ప్లే చేయించి ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని భావిస్తాడు.

మోహన్ కోసం అతని ఇంటికి వెళ్లిన అరుణ్ ఆ ఇంట్లో మోహన్ శవాన్ని చూస్తాడు.అయితే కళ్లు లేవని బయటి ప్రపంచాన్ని నమ్మించడంతో సిమ్రాన్ కు, హత్యకు సంబంధం ఉందని తెలిసినా నితిన్ ఆ విషయాన్ని చెప్పలేకపోతాడు.

Advertisement

సిమ్రాన్, సీఐ(జిస్సుసేన్ గుప్తా) మోహన్ ను ఎందుకు చంపాల్సి ఉంది? హత్యను చూసిన అరుణ్ కు నిజంగా కళ్లు ఎలా పోతాయి? సీఐకు తమన్నాకు రిలేషన్ ఏంటి? నిజంగా కళ్లు పోయిన తర్వాత నితిన్ కు ఎదురైన ఇబ్బందులేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే మాస్ట్రో కథ.

135 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా కామెడీ క్రైమ్ సినిమాలను ఇష్టపడే వాళ్లను ఖచ్చితంగా ఆకట్టుకుంది.ఊహించని ట్విస్టులు సినిమాకు ప్లస్ అయ్యాయి.నితిన్, తమన్నా తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

సీఐ భార్యగా శ్రీముఖి కనిపించింది కొన్ని నిమిషాలే అయినా తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.తమన్నా నెగిటివ్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించగలనని ఈ సినిమాతో ప్రూవ్ చేశారు.

మంగ్లీ, రచ్చరవి, హర్షవర్ధన్ పాత్రలు బాగున్నాయి.మేర్లపాక గాంధీ కథలో పెద్దగా మార్పులు చేయకపోయినా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు.పాటలు, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రోజా పొలిటికల్ సైలెన్స్ అందుకేనా ? 

థియేటర్లలో రిలీజై ఉంటే ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించేది.అయితే హిందీ సినిమా చూసిన వాళ్లకు మాత్రం ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.

Advertisement

కథ, కథనంలో చిన్నచిన్న లోపాలు లేకుండా జాగ్రత్త పడి ఉంటే సినిమా మరింత ఎక్కువమంది ప్రేక్షకులను ఆకట్టుకునేది.క్లైమాక్స్ లో మేర్లపాక గాంధీ ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేసి ఉంటే బాగుండేది.

రేటింగ్ : 2.75/5.0

తాజా వార్తలు