'మాచర్ల నియోజకవర్గం' సినిమాపై లేటెస్ట్ అప్డేట్!

Nithin Macherla Niyojakavargam Movie Latest Update

యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న కొత్త సినిమాల్లో ‘మాచర్ల నియోజకవర్గం‘ ఒకటి.వినాయక చవితి సందర్భంగా నితిన్ ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

 Nithin Macherla Niyojakavargam Movie Latest Update-TeluguStop.com

నితిన్ కెరీర్ లో 31వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

 Nithin Macherla Niyojakavargam Movie Latest Update-మాచర్ల నియోజకవర్గం’ సినిమాపై లేటెస్ట్ అప్డేట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమాపై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని కూడా నటిస్తున్నాడని ఈ వార్త సారాంశం.ఈయన నటిస్తున్నాడంటేనే కీలక పాత్ర అయి ఉంటుంది.

అంతేకాదు ఈ సినిమాలో సముద్రఖని డ్యూయెల్ రోల్ లో కనిపించ బోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Nithin, Dual Role, Krithi Shetty, Maestro, Nithin, Samudrakhani, Samudrakhani, Samuthirakani, Surender Reddy, Tollywood-Movie

మాములుగా ఏ సినిమాలో అయినా హీరోలు డ్యూయెల్ రోల్ లో నటిస్తారు.కానీ ఈ సినిమాలో మాత్రం సముద్రఖని డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసి అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.ఇక ఇందులో ఈయన ఎలాంటి పాత్రలో కనపడబోతున్నారో వేచి చూడాలి.

Telugu Nithin, Dual Role, Krithi Shetty, Maestro, Nithin, Samudrakhani, Samudrakhani, Samuthirakani, Surender Reddy, Tollywood-Movie

ఇక నితిన్ నటించిన మాస్ట్రో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 17 న ఓటిటి ద్వారా విడుదల అవ్వబోతుంది.ఇక ఈ సినిమాతో పాటు నితిన్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.

మరి నితిన్ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందు సెట్స్ మీదకు తీసుకు వెళతాడో చూడాలి.

#Krithi Shetty #Rajashekar #SamudraKhani #Nithin #Samuthirakani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube