‘అ ఆ’లో లిప్‌లాక్‌ ?

నితిన్‌ ప్రస్తుతం ‘అ ఆ’ చిత్రంలో నటిస్తున్నాడు.త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా సమంత మరియు అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నారు.

 Nithin Lip Lock With Samantha-TeluguStop.com

ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ను జరుపుకుంటుంది.భారీ అంచనాలున్న ఈ సినిమాను ఈనెలలోనే విడుదల చేయాల్సి ఉన్నా కూడా షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో ఏప్రిల్‌ నెలలో విడుదలకు సిద్దం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో సమంత మరియు నితిన్‌ల మధ్య ఒక రొమాంటిక్‌ లిప్‌ లాక్‌ సన్నివేశం ఉందట.

నితిన్‌ మరియు సమంతల మధ్య ఇప్పటికే ఆ లిప్‌లాక్‌ సీన్‌ చిత్రీకరించారని, సినిమాకు ఆ లిప్‌ లాక్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.సమంత తన మొదటి సినిమాలోనే నాగచైతన్యతో పలు లిప్‌ లాక్‌ సీన్స్‌ను చేసిన విషయం తెల్సిందే.

మళ్లీ ఆ స్థాయి లిప్‌ లాక్‌ సీన్స్‌ను ముద్దుగుమ్మ సమంత చేసింది లేదు.మళ్లీ ఇన్నాళ్లకు నితిన్‌తో లిప్‌లాక్‌ చేసి సమంత టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

త్రివిక్రమ్‌ సినిమాలో ఇప్పటి వరకు లిప్‌ లాక్‌ సీన్స్‌ ఉన్నది లేదు.మొదటి సారి ట్రెండ్‌కు తగ్గట్లుగా మారి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ లిప్‌లాక్‌ సీన్‌ను తెరకెక్కించాడు.

మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube