మేర్లపాక దర్శకత్వంలో నితిన్! బాలీవుడ్ మూవీ రీమేక్  

Nithin Gives Green Signal To Merlapaka Gandhi For Bollywood Remake-merlapaka Gandhi,nithin Gives Green Signal,tollywood

నితిన్ భీష్మ సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమా తర్వాత వరుసగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది.

Nithin Gives Green Signal To Merlapaka Gandhi For Bollywood Remake-Merlapaka Nithin Tollywood

దాంతో పాటు వెంకి అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ తో కలిసి రంగ్ దే సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.త్వరలో షూటింగ్ జరుపుకోనున్నాయి.తాజాగా నితిన్ మరో సినిమాకి కూడా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఠాగూర్ మధు, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతలుగా బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ సినిమాని రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాలో నితిన్ ని ఫైనల్ చేశారు.

ఇక ఈ సినిమాకి యువ దర్శకుడు మేర్లపాక గాంధీని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.నాని కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కారణంగా చాలా గ్యాప్ వచ్చేసింది.

కథలతో చాలా మంది హీరోల చుట్టూ తిరిగిన ఇప్పుడు ఎవరి షెడ్యూల్ కూడా ఖాళీ లేకపోవడంతో చేయడానికి ముందుకి రాలేదు.ఇలాంటి టైంలో ఊహించని విధంగా నితిన్ కి కొత్త కథ చెప్పడానికి వెళ్తే అందాదున్ సినిమా రీమేక్ అతని చేతిలో పెట్టారు.

అయితే ప్రస్తుతం నితిన్ షెడ్యూల్స్ ప్రకారం చూసుకుంటే రెండు సినిమాలు మూర్తి చేసి రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలి.దీనిని బట్టి ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులోగాని లేదంటే వచ్చే ఏడాది మొదటి భాగంలో కాని ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది.

మొత్తానికి కెరియర్ లో మొదటి సారి నితిన్ ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి.ఈ సినిమా మేర్లపాకకి తిరిగి ఎంత వరకు బూస్ట్ ఇస్తుంది అనేది చూడాలి.

తాజా వార్తలు

Nithin Gives Green Signal To Merlapaka Gandhi For Bollywood Remake-merlapaka Gandhi,nithin Gives Green Signal,tollywood Related....