ఏలేటి సినిమాలో నితిన్ డ్యూయల్ రోల్.. టాలీవుడ్ హాట్ టాపిక్  

Nithin doing dual role in Check Movie, Tollywood, Telugu Cinema, Rang De Movie, Check Movie, Chandra Sekhar Yeleti - Telugu Chandra Sekhar Yeleti, Check Movie, Nithiin, Rang De Movie, Telugu Cinema, Tollywood

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేస్తున్నాడు.

TeluguStop.com - Nithin Doing Dual Role In Check Movie

రంగ్ దే సినిమా పాటల షూటింగ్ కోసం ప్రస్తుతం ఇటలీ వెళ్ళిపోయిన నితిన్ పనిలో పనిగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ సినిమా షూటింగ్ కి చెక్ పెట్టేందుకు రెడీ అయిపోయాడు.వచ్చే నెల ఆఖరుకి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.

ఇప్పటికే చెక్ సినిమా నుంచి నితిన్ కి సంబందించిన లుక్స్ బయటకి వచ్చి కొత్తగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో కనిపించబోతుంది.

TeluguStop.com - ఏలేటి సినిమాలో నితిన్ డ్యూయల్ రోల్.. టాలీవుడ్ హాట్ టాపిక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక హీరోయిన్ గా చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరో అప్డేట్ కూడా ప్రచారంలోకి వచ్చింది.

ఈ సినిమాలో నితిన్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఒకటిగా హీరో పాత్ర ఒకటని తెలుస్తుంది.ఈ రెండు పాత్రల మధ్య నడిచే సంఘర్షణ ఈ సినిమా కథ అని టాక్.గతంలో జెంటిల్మన్, ప్రస్తుతం రామ్ రెడ్ మూవీ ఇలాంటి కథాంశంతోనే తెరకెక్కాయి.

అలాగే గతంలో కూడా చాలా సినిమాలు ఇలాంటి ఎలిమెంట్ తో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి.ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో స్క్రీన్ ప్లే మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి నితిన్ కి ఏ స్థాయిలో హిట్ ఇస్తాడు అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ సినిమాని నితిన్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు.

#Rang De Movie #ChandraSekhar #Nithiin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithin Doing Dual Role In Check Movie Related Telugu News,Photos/Pics,Images..