ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తుపట్టారా..?

జయం సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన నితిన్ ఈ ఏడాది రంగ్ దే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఫ్లాపులు, హిట్లతో సంబంధం లేకుండా ఈ హీరో వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

 Nithin Childhood Photo Goes Viral In Social Media, Child Hood Photo, Goes Viral,-TeluguStop.com

అయితే ఈ టాలీవుడ్ యంగ్ హీరోకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ ఫోటోలో నితిన్ క్యూట్ గా కనిపిస్తూ ఉండటం గమనార్హం.

అమ్మతో పాటు నితిన్ ఫోటో దిగగా నెటిజన్లను ఈ ఫోటో ఆకట్టుకుంటోంది.

మెడలో దండతో నితిన్ ఈ ఫోటోలో గుర్తు పట్టలేని విధంగా ఉన్నారు.

నితిన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నితిన్ చైల్డ్ హుడ్ అని ఫోటో అని నితిన్ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.మరోవైపు నితిన్ హీరోగా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

క్లాస్ సినిమాలతో హిట్లు సాధిస్తున్న నితిన్ నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజయ్యాయి.ఈ రెండు సినిమాలలో చెక్ బిలో యావరేజ్ అనిపించుకుంటే రంగ్ దే మాత్రం ససెస్ సాధించడం గమనార్హం.

మరోవైపు ఈ హీరో ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీకి తన సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.రచయితగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న వక్కంతం వంశీ డైరెక్టర్ గా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాతోనైనా వక్కంతం వంశీ దర్శకునిగా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.వక్కంతం వంశీ దాదాపు 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు.

Telugu Childhood, Nithin-Movie

మొదట్లో సినిమాల్లో నటించిన వక్కంతం వంశీ తరువాత రోజుల్లో సురేందర్ రెడ్డి సినిమాలకు ఎక్కువగా రచయితగా పని చేశారు.వక్కంతం వంశీ ఎన్టీఆర్ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube