భీష్మ టైటిల్ పై రచ్చ మొదలు,తొలగించాలి అంటూ డిమాండ్  

Nithin Bhishma Title Should Be Removed Bjp Dharmika Sel Demanding - Telugu Bheeshma Tittle Issue, Bhishma, Bjp Workers Protest Bheeshma Tittle, Nithin And Rashmikha Mandhana, Nithin Bheeshma Latest Update,

బాలీవుడ్ లో ఈ టైటిల్స్ పై రచ్చ సర్వ సాధారణం అని చెప్పాలి.గతంలో ఎన్నో చిత్రాల టైటిల్స్ వివాదాలకు నెలవుగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

Nithin Bhishma Title Should Be Removed Bjp Dharmika Sel Demanding - Telugu Bheeshma Tittle Issue, Bhishma, Bjp Workers Protest Bheeshma Tittle, Nithin And Rashmikha Mandhana, Nithin Bheeshma Latest Update, -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న భీష్మ మూవీ టైటిల్ పై కూడా వివాదం నెలకొంది.మహాభారతానికి మూల పురుషుడు,ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించిన భీష్ముడి పేరు తో ఒక లవర్ బాయ్ చిత్రాన్ని రూపిస్తున్నారు అంటూ బీజేపీ ధార్మిక సెల్ నేతలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం భీష్మ అన్న పేరుతో విడుదల చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయి అంటూ వారు టైటిల్ పై రగడ మొదలు పెట్టారు.గతంలో కూడా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్ర టైటిల్ పై కూడా వివాదం మొదలైన సంగతి తెలిసిందే.

దానితో చివరికి కోర్టుకు కూడా వెళ్లడం తో సినిమా రిలీజ్ డేట్ కు ఒక్కరోజు ముందు గద్దల కొండ గణేష్ పేరుతో చిత్రాన్ని విడుదల చేయాల్సి వచ్చింది.అయితే ఇప్పుడు భీష్మ టైటిల్ పై కూడా వివాదం నెలకొంది.

సోమవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎఎస్‌ఎ్‌సలో ధార్మిక సెల్‌ కన్వీనర్‌ తూములూరి శ్రీకృష్ణచైతన్య శర్మ, ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము, కార్యవర్గ సభ్యులు వంగల రామకృష్ణ, భీమ్‌సేన్‌మూర్తి తదితరులు మాట్లాడారు.

భీష్మ సినిమా టైటిల్‌ను వెంటనే మార్చాలని, ఇందులో హీరోను లవర్‌ బాయ్‌గా చూపిస్తూ ఆ పాత్రకు భీష్మ అని పేరు పెట్టడం బాధాకరమన్నారు.

అందుకే వెంటనే టైటిల్ మార్చాలని, లేని పక్షంలో ఈ సినిమాను అడ్డుకుంటామంటూ వారు హెచ్చరిస్తున్నారు.ఒక వేళ సినిమా పేరును మార్చకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా వెనకాడం అంటూ వారు స్పష్టం చేస్తున్నారు.

తాజా వార్తలు

Nithin Bhishma Title Should Be Removed Bjp Dharmika Sel Demanding-bhishma,bjp Workers Protest Bheeshma Tittle,nithin And Rashmikha Mandhana,nithin Bheeshma Latest Update Related....