నితిన్‌ ‘భీష్మ’ ప్రివ్యూ  

Nithin Bheeshma Preview - Telugu Chalo Fame Venky Kudumula, Nithin, Nithin And Rashmikha Mandhana, Nithin And Venky Kudumula, Nithin Bheeshma Movie Latest News, Nithin Srinivasa Kalyanam

నితిన్‌ శ్రీనివాస కళ్యాణం చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని చేశాడు.శతమానం భవతి అంతటి విజయాన్ని ఆ సినిమా దక్కించుకుంటుందని అంతా ఆశించారు.

Nithin Bheeshma Preview - Telugu Chalo Fame Venky Kudumula And Rashmikha Mandhana Movie Latest News Srinivasa Kalyanam

కాని ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.దిల్‌రాజు భారీ నష్టాలను చవి చూశాడు.

ఆ సినిమా ఇచ్చిన ఫలితంతో మైండ్‌ బ్లాంక్‌ అయిన నితిన్‌ ఏకంగా ఏడాది పాటు టైం తీసుకున్నాడు.తదుపరి చిత్రం మొదలు పెట్టడానికి సంవత్సరం తీసుకున్న నితిన్‌ భీష్మ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో చేశాడు.

ఛలో చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని అదే తరహా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో మేకర్స్‌ మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచేశారు.తప్పకుండా ఈ సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది.

నితిన్‌కు ఈ సినిమా సక్సెస్‌ చాలా కీలకం.అందుకే దర్శకుడు వెంకీ కుడుముల ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ ఈ సినిమాలోని ప్రతి సీన్‌ను తెరకెక్కించాడట.నితిన్‌ మరియు రష్మిక మందన్న జోడీకి మంచి పేరు వచ్చింది.వీరిద్దరు రొమాన్స్‌ను అదరగొట్టారు అంటూ అంతా అభినందిస్తున్నారు.రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.

తాజా వార్తలు

Nithin Bheeshma Preview-nithin,nithin And Rashmikha Mandhana,nithin And Venky Kudumula,nithin Bheeshma Movie Latest News,nithin Srinivasa Kalyanam Related....