సైరా తో సై..రిస్క్ అవసరమా?  

Nithin Bheeshma Box Office Fight With Syeraa-bheeshma Movie Release Date,nithin

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిల్మ్ సైరా. ఈ సినిమా కోసం సినీ ప్రముఖుల నుంచి ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దసరా హాలిడేస్ లో గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని నిర్మాత రామ్ చరణ్ ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు..

సైరా తో సై..రిస్క్ అవసరమా? -Nithin Bheeshma Box Office Fight With Syeraa

ఆ సమయంలో మరో సినిమాను రిలీజ్ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు. కానీ మొదటిసారి హీరో నితిన్ మెగాస్టార్ సైరాతో బాక్స్ ఆఫీస్ ఫైట్ కి సై అంటున్నాడు. చలో ఫెమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో చేస్తోన్న భీష్మా సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరా హాలిడేస్ లో రిలీజ్ చెయ్యాలని చూస్తున్నాడు.

సైరా – భీష్మా ఒకే రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్ రిస్క్ చేస్తున్నప్పటికీ సినిమాపై నమ్మకంతో ఓ వర్గం ఆడియెన్స్ తనవైపుకు మళ్లుతారనే ఆశలు పెంచుకుంటున్నాడు..

ప్రస్తుతం ఈ విషయంపై హీరో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్ డోస్ పెంచి సైరా తో పోటీకి సిద్ధమవ్వాలని కుర్రహీరో తన టీమ్ ను మోటివేట్ చేస్తున్నాడట. మరి ఆ బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాం.