పవన్‌పై అభిమానంతో నితిన్‌ చెత్త నిర్ణయం

పవన్‌ కళ్యాణ్‌ అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పలువురు యువ హీరోలకు చాలా అభిమానం.మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ఇతరులు కూడా పవన్‌ కళ్యాణ్‌పై అభిమానంను సందర్బానుసారంగా వ్యక్తం చేస్తూ ఉంటారు.

 Nithin Bad Decision-TeluguStop.com

యువ హీరోల్లో పవన్‌కు వీరాభిమాని ఎవరు అంటే ప్రతి ఒక్కరు ఠక్కున చెప్పే సమాధానం నితిన్‌.అవును, నితిన్‌ తన ప్రతి సినిమాలో కూడా పవన్‌ను ఇమిటేట్‌ చేయడం, పవన్‌పై తనకున్న అభిమానంను వ్యక్తం చేయడం చేస్తూ ఉంటాడు.

పవన్‌పై ఉన్న అభిమానంతో నితిన్‌ తీసుకునే కొన్ని నిర్ణయాలు సిల్లీగా అనిపిస్తాయి.కాని అదంతా కూడా తాను పవన్‌పై అభిమానంతో చేస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొస్తాడు.

సినిమాల్లో పవన్‌ను ఎలా అయితే ఇమిటేట్‌ చేస్తాడో, నిజ జీవితంలో కూడా పవన్‌ను అనుసరించేందుకు ప్రయత్నిస్తాడు.పవన్‌ కళ్యాణ్‌ గతంలో కరుణాకరన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేశాడు.దాంతో నితిన్‌ కూడా ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని కోరుకున్నాడు.ఆయన సక్సెస్‌లో లేడని, వరుసగా ఫ్లాప్‌లు చేస్తున్నాడని తెలిసినా కూడా కరుణాకరన్‌తో సినిమా చేశాడు.

అంతా భావించినట్లుగానే అది నితిన్‌ను నిరాశ పర్చింది.అయినా కూడా పవన్‌ దర్శకుడితో తానో సినిమా చేశాను అనే సంతృప్తి నితిన్‌ పొందాడు.

ఇప్పుడు మరోసారి అదే నిర్ణయం తీసుకుని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

పవన్‌ కళ్యాణ్‌తో ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ చిత్రాలను తెరకెక్కించిన డాలీ దర్శకత్వంలో నితిన్‌ ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.

పవన్‌తో తెరకెక్కించిన ఆ రెండు సినిమాలు కూడా డాలీకి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేక పోయాయి.కాటమరాయుడు తర్వాత ఇప్పటి వరకు డాలీ మరో సినిమాకు కమిట్‌ అయ్యింది లేదు.

అలాంటి డాలీని స్వయంగా ఏరి కోరి నితిన్‌ తన తర్వాత సినిమాకు ఎంపిక చేసుకోవడం జరిగింది.ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాన్ని చేస్తున్న నితిన్‌ ఆ తర్వాత డాలీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఇలాంటి ప్రయోగాలను ఏ ఇతర నిర్మాతలు కూడా సమర్ధించరు.అందుకే ఈ సినిమాను తన సొంత బ్యానర్‌లోనే చేయాలని నితిన్‌ ఫిక్స్‌ అయ్యాడు.

అందుకోసం కథను కూడా సిద్దం చేయిస్తున్నాడు.గతంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రాన్ని తెరకెక్కించిన డాలీ పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు.

చేసిన సినిమాలన్ని కూడా ప్రేక్షకులను నిరాశ పర్చాయి.అయినా కూడా నితిన్‌కు ఉన్న పవన్‌ పిచ్చి కారణంగా డాలీ మంచి ఆఫర్‌ను దక్కించుకున్నాడు.

మరి ఈసారైనా కాస్త గుర్తింపును దక్కించుకుంటాడేమో చూడాలి.పవన్‌పై అభిమానంతో ఈ సినిమాను చేస్తున్న నితిన్‌కు ఎలాంటి అనుభూతి మిగులుతుందోనన్న ప్రశ్న అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube