ఆగష్టులో వక్కంతం వంశీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్న నితిన్

యూత్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో నితిన్.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకు నితిన్ కేరాఫ్ అడ్రస్ గా మారాడు.

 Nithin And Vakkantham Vamsi Movie Going On Sets In August-TeluguStop.com

ఈ మధ్యకాలంలో ఇలాంటి జోనర్ లో కథలు తక్కువ కావడంతో, రొమాంటిక్ లవ్ అండ్ కామెడీతో కథ సిద్ధం చేసుకొని నితిన్ దగ్గరకు వచ్చే వారికి కచ్చితంగా అవకాశం దొరుకుతుంది.అలాగే నితిన్ కెరీర్లో ఫ్లాప్ ల సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేయడం అతని ప్రత్యేకత.

వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నితిన్ వెంటనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ మూవీతో డిజాస్టర్ కొట్టాడు.ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన రంగ్ దే సినిమా కూడా డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది.

 Nithin And Vakkantham Vamsi Movie Going On Sets In August-ఆగష్టులో వక్కంతం వంశీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్న నితిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హిందీ హిట్ మూవీ అందాధున్ రీమేక్ గా మ్యాస్ట్రో సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రచయిత నుంచి దర్శకుడుగా మారిన వక్కంతం వంశీతో నితిన్ ఓ సినిమా చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వక్కంతం వంశీ మొదటి ప్రయత్నంలోనే చేదు ఫలితాన్ని ఎదుర్కొన్నారు.

అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఇంట్రెస్టింగ్ గా మంచి కథని రెడీ చేసుకుని నితిన్ కి చెప్పి ఓకే చేయించుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాని ఆగష్టులో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి నితిన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

దీని కంప్లీట్ చేసిన తర్వాత మరో కొత్త దర్శకుడితో మూవీని నితిన్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.దాని తర్వాత కృష్ణచైతన్య దర్శకత్వంలో పవర్ పేట సిరీస్ నీ సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.

#August #Rang #Nithin #Maestro

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు