క్లిక్ క్లిక్ : భార్యతో కలిసి నితిన్‌ పుట్టిన రోజు వేడుక

యంగ్ హీరో నితిన్ పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియా లో ఆయన అభిమానులు మరియు మిత్రులు సన్నిహితులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సంబంధించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

 Nithin And Shalini Photos Birthday Special Details, Nithin, Shalini, Macharla Ni-TeluguStop.com

అభిమానులు నితిన్ సినిమా లకు సంబంధించిన పోస్టులు షేర్ చేయడం ద్వారా ఆయన పుట్టిన రోజును భారీ ఎత్తున నిర్వహించుకుంటున్నారు.ఇదే సమయం లో ఆయన ప్రస్తుతం నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా కు సంబంధించిన ఒక యాక్షన్ సన్నివేశాన్ని విడుదల చేయడం జరిగింది.

ఆ యాక్షన్ సన్నివేశం సినిమా పై భారీ అంచనాలను పెంచుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఈ మధ్య కాలంలో నితిన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోవడం లో విఫలమయ్యాయి.

రంగ్‌ దే సినిమా పర్వాలేదనిపించినా ఇతర సినిమాల విషయం లో మాత్రం ఆయనకు తీవ్రమైన నిరాశ ఎదురైంది.

అందుకే మాచర్ల నియోజక వర్గం సినిమాకు సంబంధించిన వసూళ్ల లో కచ్చితం గా పాజిటివ్ గా ఉంటాయని ఆయన నమ్ముతున్నాడు.

ఇక నేడు పుట్టిన రోజు సందర్భంగా భార్య శాలిని తో కలిసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.ఆ సందర్భంగా వీరు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

ప్రస్తుతము ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నితిన్ మరియు శాలినికి అభిమానులు మరియు మీడియా వర్గాల వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నితిన్ గతం లో ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా మరియు ఆనందం గా కనిపిస్తున్నాడు.అది కేవలం నీ వల్లే శాలిని అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తుంటే.

మరి కొందరు మాత్రం నితిన్ కు జోడిగా శాలిని హీరోయిన్ గా నటిస్తే మరింత బాగుంటుంది కదా అంటూ సలహాలు ఇస్తున్నారు.పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నా ఈ సమయం లో ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్ డే నితిన్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube