కుర్ర హీరోలందరూ సంక్రాంతినే టార్గెట్ చేశారు  

young heroes target sankranthi release, Hero Nithin, Hero Akkineni Akhil, Sarwanand, Pawan Kalyan, Darling Prabhas - Telugu Darling Prabhas, Hero Akkineni Akhil, Hero Nithin, Pawan Kalyan, Sarwanand, Young Heroes Target Sankranthi Release

సంక్రాంతి వచ్చింది అంటే కచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాలలో సంప్రదాయ పండగ సంతోషాలతో పాటు సినిమా పండగ కూడా ఉంటుంది.ఆ సమయంలో స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తారు.

 Nithin Akkineni Akhil Sarwanand Pawan Kalyan Prabhas

దీంతో సంక్రాంతి సమయంలో అభిమానుల సందడి విపరీతంగా ఉంటుంది.తమ హీరో సినిమా సూపర్ హిట్ అంటే తమ హీరో సినిమా సూపర్ హిట్ చెప్పుకుంటారు.

ఈ సందడి కోసం స్టార్ హీరోలు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.అయితే ఈ ఏడాది సంక్రాంతి ఇంకా ప్రత్యేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది.

కుర్ర హీరోలందరూ సంక్రాంతినే టార్గెట్ చేశారు-Movie-Telugu Tollywood Photo Image

గత ఆరు నెలలుగా కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో సినిమాలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది.షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.

త్వరలో పరిస్థితులు అదుపులోకి వస్తే సినిమాలని వీలైనంత వేగంగా స్టార్ట్ చేసి రిలీజ్ కి రెడీ అవ్వాలని కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలా మంది ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా ఈ సారి సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ ని కుర్ర హీరోలు కూడా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో సంక్రాంతి బరిలో దిగడానికి హీరో నితిన్ రంగ్ దే సినిమాతో రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. శర్వానంద్ శ్రీకారం అంటూ దారులు వెతుక్కుంటున్నాడు.

ఇక అక్కినేని యువ హీరో అఖిల్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో యూత్ కి పిచ్చేక్కించాలని అనుకుంటున్నాడు.ఓ వైపు వీరు సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టాలని కసితో ఉంటే వీరికి పోటీగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో వస్తున్నాడు.

ఇక డార్లింగ్ ప్రభాస్ రాదేశ్యామ్ తో రికార్డుల దుమ్ము దులపాలని అనుకుంటున్నాడు.ఓ వైపు రెండు పెద్ద ప్రాజెక్టులకి పోటీగా మూడు కుర్ర హీరోల సినిమాలతో సంక్రాంతి సీజన్ మంచి సందడిగా మారిపొయే అవకాశం ఉందని అనిపిస్తుంది.

#Pawan Kalyan #Sarwanand #Darling Prabhas #Hero Nithin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithin Akkineni Akhil Sarwanand Pawan Kalyan Prabhas Related Telugu News,Photos/Pics,Images..