శుభ ముహూర్తాన నితిన్ కృతి శెట్టి కొత్త సినిమా స్టార్ట్ !

యూత్ స్టార్ నితిన్ వినాయక చవితి సందర్భంగా ఈ రోజు తన కొత్త సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ చేసాడు.ఈ సినిమాను ‘నితిన్31‘ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించ బోతున్నారు.

 Nithin 31 Movie Launch With Pooja Ceremony, Nithin,tollywood, Maestro, Surender-TeluguStop.com

ఈ సినిమాను ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఈ సినిమా ప్రారంభోత్సవానికి వెంకీ కుడుముల, అల్లు అరవింద్, అనిల్ రావిపూడి, బివిఎస్ఎన్ ప్రసాద్, మేర్లపాక గాంధీ అతిధులుగా వచ్చారు.

ఇక ఈ సినిమాలో మొదటి షాట్ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నితిన్ కృతి శెట్టి పై క్లాప్ కొట్టారు.ఇక ఈ రోజే ప్రారంభం అయినా ఈ సినిమా నుండి అప్పుడే అప్డేట్ రాబోతుంది.

Telugu Nithin, Krithi Shetty, Maestro, Nithinlaunch, Surender Reddy, Tollywood-M

రోజు సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు ఈ సినిమా టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించ బోతుంది.ఇక ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి స్టార్ట్ కాబోతుంది.ప్రస్తుతం నితిన్ నటించిన మాస్ట్రో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.Telugu Nithin, Krithi Shetty, Maestro, Nithinlaunch, Surender Reddy, Tollywood-M

ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 17 న ఓటిటి ద్వారా విడుదల అవ్వబోతుంది.ఇక ఈ సినిమాతో పాటు నితిన్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.నితిన్ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందు సెట్స్ మీదకు తీసుకు వెళతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube