డిజిటల్ లో రిలీజ్ కాబోతున్న నితిన్ మ్యాస్ట్రో

నితిన్ కెరియర్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి.ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడితే దాని తర్వాత వెంట వెంటనే రెండు ఫ్లాప్ లు నితిన్ ఖాతాలో పడుతూ ఉంటాయి.

 Nithiins Maestro Movie Ott Release Hotstar-TeluguStop.com

సెలక్టివ్ కథలతోనే సినిమాలు చేసినా కూడా అతనికి రిజల్ట్ మాత్రం అలాగే వస్తుంది.మంచి టాలెంటెడ్ హీరోగా పేరున్న కూడా ఈ ఫ్లాప్ ల కారణంగానే నితిన్ 19 ఏళ్ల కెరియర్ లో స్టార్ హీరో ఇమేజ్ ని అందుకోలేకపోయాడు.

కావాల్సినంత బ్యాగ్రౌండ్ ఉన్న కూడా కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు.అయితే ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో తనకంటూ కొంత మార్కెట్ ని మాత్రం నితిన్ ఏర్పరుచుకున్నాడు.

 Nithiins Maestro Movie Ott Release Hotstar-డిజిటల్ లో రిలీజ్ కాబోతున్న నితిన్ మ్యాస్ట్రో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతని సినిమా హిట్ అయితే ఓ 50 కోట్ల వరకు కలెక్షన్ గ్యారెంటీ వేసుకోవచ్చు.ఇక ఈ ఏడాదిలో చెక్, రంగ్ దే సినిమాలతో డిజాస్టర్స్ ని ఖాతాలో వేసుకున్న నితిన్ ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా షూటింగ్ పూర్తి చేశాడు.

హిందీ హిట్ మూవీ అందాధున్ రీమేక్ గా ఇది తెరకెక్కింది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కి తాజాగా గుమ్మడికాయ కొట్టేశారు.ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.అయితే ప్రస్తుతానికి పాత సినిమాలతో థియేటర్స్ ని మామూలుగా ఓపెన్ చేశారు.ఇక మ్యాస్ట్రో రిలీజ్ విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఈ ఏడాది రెండు ఫ్లాప్ లు కొట్టడంతో మళ్ళీ ఇలాంటి సమయంలో రిస్క్ చేసి థియేటర్స్ లో మ్యాస్ట్రో రిలీజ్ చేయడం కంటే ఒటీటీకి వెళ్ళడం బెటర్ అనే అభిప్రాయానికి దర్శక, నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో మ్యాస్ట్రో మూవీకి డిస్నీ హాట్ స్టార్ నుంచి 40 కోట్ల రూపాయిలు డిజిటల్ రిలీజ్ కోసం ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో తండ్రి నిర్మాణంలోనే తెరకెక్కుతున్న సినిమా కావడంతో నితిన్ కూడా డిజిటల్ రిలీజ్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు వినికిడి

.

#MaestroMovie #Hotstar #Nithiin #Nabha Natesh #OTT Release

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు