ఎక్కువ ప్లాప్ సినిమాలు ఏ హీరోకు ఉన్నాయని వెతికేవాడిని.. హీరో నితిన్!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీబిజీ గా ఉన్న విషయం తెలిసిందే.హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం.

 Nithiin Shares Experience Macherla Niyojakavargam Movie Nithin, Tollywood, Macherla Niyojakavargam Movie, Krithi Shetty, Anjali,-TeluguStop.com

ఈ సినిమా మాస్,కమర్షియల్ సినిమాగా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.ఇక మాచర్ల నియోజక వర్గం సినిమా కూడా నితిన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు.ఇక ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Nithiin Shares Experience Macherla Niyojakavargam Movie Nithin, Tollywood, Macherla Niyojakavargam Movie, Krithi Shetty, Anjali, -ఎక్కువ ప్లాప్ సినిమాలు ఏ హీరోకు ఉన్నాయని వెతికేవాడిని.. హీరో నితిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ రారా రెడ్డి పాటలో సందడి చేస్తోంది.కాగా ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది.కాగా ఈ ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్భంగా హీరో నితిన్ మీడియా సమావేశంలో నితిన్‌ పంచుకున్న మాచర్ల నియోజకవర్గం చిత్ర విషయాలు విశేషాలు ఇవి.ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.మాచర్ల నియోజకవర్గం చిత్రం పక్క కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో ఉండే కథ చాలా యూనిక్‌గా వుంటుందనీ తెలిపాడు నితిన్.

Telugu Anjali, Krithi Shetty, Nithin, Tollywood-Movie

అయితే ఇది వరకు పొలిటికల్ నేపథ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి.కానీ మాచర్ల లో ఉండే పాయింట్ చాలా కొత్తగా ఉంటూ కొత్త ఫార్మెట్ లో ఉంటూనే కొత్త పాయింట్ తో ఉంటుందనీ తెలిపాడు నితిన్.అలాగే మాచర్ల నియోజకవర్గం సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్.సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యుమర్, ఫన్ , మాస్, క్లాస్ అన్నీ వుంటాయి అని చెప్పుకొచ్చాడు నితిన్.

ఒకవేళ సలహా ఇవ్వమని అడిగితే సినిమా కొనమని మాత్రమే చెప్పను.ఎందుకంటె రేట్లు జోలికి మాత్రం వెళ్లను అని నవ్వుతూ తెలిపాడు నితిన్.అయితే నితిన్ కు విక్రమ్ సినిమా చూసి వారం రోజులు నిద్రపట్టలేదట.సినిమా అంటే ఇలా వుండాలి కదా, ఇలా తీయాలి కదా అనిపించిందట.

అయితే ఒకే మూసలో వుండే ఫార్ములా కాకుండా కథని బలంగా నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి.భవిష్యత్ లో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పుకొచ్చాడు నితిన్.

 ఇండియాలో ఎక్కువ ఫ్లాఫ్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరు అని గూగల్ చేసేవాడిని అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు వచ్చేవి.వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని.

కొన్ని విమర్శలు బాధ కలిగించేవి అని చెప్పుకొచ్చాడు నితిన్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube