రంగ్ దే అంటూ హనీమూన్ చెక్కేస్తున్న నితిన్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే.షాలిని రెడ్డితో వివాహాన్ని కొంతమంది సన్నిహితుల మధ్య ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుపుకున్న నితిన్‌కు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

 Nithiin Shalini To Fly Europe For Honeymoon, Nithiin, Shalini Reddy, Nithiin Mar-TeluguStop.com

ఇక పెళ్లి తరువాత నితిన్ హనీమూన్ ఎక్కడ చేసుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ప్రస్తుతం నితిన్ నటిస్తున్న రంగ్ దే చిత్ర షూటింగ్‌ను వెంటనే ప్రారంభించాలని నితిన్ చూస్తున్నాడట.
ఈ క్రమంలోనే రంగ్ దే చిత్ర షూటింగ్‌ను యూరప్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే ఈ షూటింగ్ కోసం నితిన్ తన భార్యను కూడా యూరప్ తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడు.

అక్కడే తన హనీమూన్‌ను ప్లాన్ చేస్తున్నాడట ఈ హీరో.మొత్తానికి రంగ్ దే చిత్రం షూటింగ్‌తో పాటు నితిన్ తన హనీమూన్‌ను ప్లాన్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నితిన్ ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నితిన్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా టీజర్‌ను నితిన్ పెళ్లి కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.ఈ సినిమా తరువాత నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మొత్తానికి వరుస సినిమాలతో నితిన్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube