క్రిస్మస్ కానుకగా రంగ్ దే..?

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ ఇప్పటికే చివరి దశ షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Nithiin Rang De As Christmas Release, Nithiin, Rang De, Venky Atluri, Keerthy Su-TeluguStop.com

అయితే ఈ సినిమాతో నితిన్ మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా చూస్తున్నాడు.ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా అనుకున్నదానికంటే ముందే షూటింగ్ ముగించుకుంటుండటంతో ఈ సినిమాను ముందుగానే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ క్రమంలో డిసెంబర్ నెలలో ఈ రంగ్ దే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తే, సంక్రాంతి బరిలో తీవ్ర పోటీ ఎదుర్కొవాల్సిన పని ఉండదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు డిసెంబర్‌లో ఒకటి అరా సినిమాలు తప్ప పెద్దగా రిలీజ్ అయ్యేవి ఏమీ లేకపోవడంతో, ఈ నెలలో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో రంగ్ దే చిత్రాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేసేందుకే నితిన్ అండ్ టీమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది.ఇక ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లకు మంచి ఆదరణ లభించింది.

రంగ్ దే చిత్రంతో నితిన్ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తాడా లేడా అనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube