కొరటాల చేతుల మీదగా చెక్ పెట్టిన నితిన్

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి నితిన్ అదిరిపోయే హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

 Nithiin New Movie Title Check, Nithiin, Chandrasekhar Yeleti, Check, Tollywood N-TeluguStop.com

నితిన్ రీసెంట్‌గా భీష్మ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకోవడంతో రంగ్ దే చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక రంగ్ దే చిత్రం పూర్తి కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే లైన్‌లో పెట్టాడు.

విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు నితిన్ రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు ‘చెక్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రిలీజ్ చేయడంతో ఈ సినిమా టైటిల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌లో టైటిల్‌కు తగ్గట్టుగానే చదరంగం ఆడుతున్న నితిన్‌ను మనకు చూపించారు.అయితే నితిన్ చేతికి సంకెళ్లు ఉండటం ఇక్కడ కొసమెరుపు అని చెప్పాలి.

ఇలా ప్రీలుక్ పోస్టర్‌తోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన చెక్ చిత్ర యూనిట్, ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే సినిమాగా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నారు.ఈ సినిమాలో నితిన్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.

కాగా ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మరో హీరోయిన్‌గా ప్రియా వారియర్ నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube