టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటున్న హీరోహీరోయిన్లు

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగ్‌దే ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Nithiin Keerthy Suresh Funny Incident On Rang De, Nithiin, Keerthy Suresh, Rang-TeluguStop.com

ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో మరోసారి నితిన్ తన సక్సె్స్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో నితిన్, కీర్తి సురేష్‌ల మధ్య చాలా సరదా ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.తాజాగా వారి మధ్య జరిగిన ఓ ఫన్నీ మూమెంట్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

హీరో నితిన్ తీవ్రంగా కష్టపడుతుంటే, హీరోయిన్ కీర్తి సురేష్ నిద్రపోతుందంటూ ఓ ఫోటోను చిత్ర యూనిట్ సరదాగా ట్వీట్ చేసింది.అయితే ఈ ఫోటోపై కీర్తి సురేష్ కూడా తనదైన రీతిలో కామెంట్ చేసింది.

నేను పడుకోవడం మీకు అసూయగా ఉంది కదా అంటూ కీర్తి సురేష్ ట్వీట్ చేయడంతో ఈ ఫోటోపై హీరోహీరోయిన్లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుతున్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోండగా, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లకు మంచి రెస్పాన్స్ లభించింది.

మరి ఈ రంగ్ దే చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.కాగా కీర్తి సురేష్ ఇప్పటికే వరుసబెట్టి చిత్రాలను రిలీజ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube