రాకింగ్ స్టార్ యష్ ని పరిచయం చేసిన దర్శకుడు చేతుల మీదుగా మరో హీరో

బస్ కండక్టర్ కొడుకు హీరో అవ్వడం అంటే అంత తేలిక కాదు.కాని కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ హీరో, రాకింగ్ స్టార్ యష్ లైఫ్ స్టార్ట్ చేసింది ఆ విధంగానే.

 Nithiin Jayam Movie Remake In Kannada After 20 Years-TeluguStop.com

సినిమాలో హీరోగా ఎదగాలనే ఆశతో నటుడుగా కెరియర్ ప్రారంభించి యష్ ఆరంభంలో సీరియల్స్ లో నటించాడు.తరువాత అతనిలో స్పార్క్, టాలెంట్ చూసిన శశాంక్ అనే దర్శకుడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

మొదటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన తరువాత హీరోగా అవకాశం అందుకొని మొదటి సినిమాతో యష్ హిట్ కొట్టాడు.అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా దూసుకుపోయాడు.

 Nithiin Jayam Movie Remake In Kannada After 20 Years-రాకింగ్ స్టార్ యష్ ని పరిచయం చేసిన దర్శకుడు చేతుల మీదుగా మరో హీరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యష్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసి దర్శకుడు శశాంక్ ఇప్పుడు ప్రవీణ్ అనే కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించారు.

ప్రవీణ్ ని హీరోగా ఎంపిక చేసుకొని అతనికి ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి మరీ ఈ మూవీని తెరకెక్కించారు.

ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.దీనిని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.దీని తర్వాత హీరో ప్రవీణ్ 20 ఏళ్ల నితిన్ హీరోగా తెరకెక్కిన జయం మూవీ రీమేక్ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది.యూత్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో నితిన్ జయం సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాడు.

ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఆ సినిమా నితిన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.తేజ్ కి కూడా హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది.

అదే సినిమాతో తమిళంలో జయం రవి హీరోగా పరిచయం అయ్యాడు.ప్రస్తుతం కమర్షియల్ స్టార్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు.

ఇప్పుడు జయం మూవీని పీరియాడిక్ జోనర్ లో కన్నడంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.త్వరలో ఈ సినిమా పట్టాలు ఎక్కబోతున్నట్లు బోగట్టా.

#After 20 Years #Nithiin #Hero Praveen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు