తొలి చిత్రం బాణం నుండి విలక్షణమైన సినిమాలు చేస్తూ వచ్చిన నారా రోహిత్ ఇప్పుడు చేతిలో ఐదారు ప్రాజెక్టులతో బిజీ హీరోగా ఉన్నాడు.వరుస రిలీజ్‌లకు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు.
అప్పట్లో ఒకడుండేవాడు, సావిత్రి, తుంటరి, కథలో రాజకుమారి, రాజా చెయ్యవేస్తే ఇలా ఈ ఏడాదికి ఆరు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు.ఈ వరుసలో రాజా చెయ్యి సినిమాను స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న సాయికొర్రపాటి, వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో నాగశౌర్య కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని ఫిలింవర్గాల సమాచారం.రాజా చెయ్యివేస్తే సినిమాను జనవరి నుండి సెట్స్‌లోకి తీసుకెళ్ళడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.అందులో భాగంగా హీరోయిన్ కోసం చాలా ప్రయత్నాలు చేశారట.
చివరకు తెలుగులో నితిన్ సరసన గుండె జారి గల్లంతయ్యిందే, కొత్త హీరో ప్రదీప్ సరసన మై నే ప్యార్ కియా వంటి సినిమాలు చేసిన ఇషా తల్వార్‌ను హీరోయిన్గా ఓకే చేశారట.త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తారట.
తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఇషా తల్వార్‌కు ఇక్కడ అవకాశాలు మాత్రం కరువైయ్యాయనే చెప్పాలి.దాంతో మలయాళంలో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఈ అవకాశం రావడం కొసమెరుపే.