వెయిట్ చేయండి త్వరలో రెండు సినిమాలతో వస్తా! హీరో నితిన్ క్లారిటీ!  

తన నెక్స్ట్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన హీరో నితిన్, రెండు ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకి వస్తా అని హామీ. .

  • యంగ్ హీరో నితిన్ చల్ మోహన్ రంగ సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ సినిమాతో తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ మెంట్ కూడా నితిన్ నుంచి రాలేదు. చలో దర్శకుడు వెంకి కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తుంది అని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం బయటకి రాలేదు.

  • ఇదిలా వుంటే తాజా గా నితిన్ తన గ్యాప్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. తన లాస్ట్ సినిమా తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నందుకు సారీ చెబుతున్న, అయితే త్వరలో తన సినిమాల గురించి మీకు సమాచారం ఇస్తా, ఈ సంవత్సరం రెండు సినిమాలతో మీ ముందుకి వస్తా, ప్రస్తుతం అవి ఫైనల్ స్టేజి లో వున్నాయి. త్వరలో వాటికి సంబంధించిన సమాచారం మీకు వినిపిస్తా. కచ్చితంగా ఈ సారి బెస్ట్ మూవీస్ తో మీ ముందుకి వస్తా అంటూ నితిన్ తన ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.