నితిన్ చెక్ రివ్యూ & రేటింగ్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చెక్’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు.

 Nithiin Check Movie Review Rating, Nithiin, Check, Review, Priya Varrier, Rakul-TeluguStop.com

ఇక ఈ సినిమాను దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కంటెంట్ ఏ విధంగా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.కాగా ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న చెక్ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:

చెస్ ప్లేయర్ అయిన ఆదిత్య(నితిన్) ఉరిశిక్ష పడ్డ ఖైదీగా జైలులో జీవితం గడుపుతుంటాడు.అయితే ఓ చెస్ ప్లేయర్‌కు ఉరిశిక్ష ఎందుకు పడింది, అనే ఆసక్తితో అతడి కేసును వాదించేందుకు లాయర్ శృతి(రకుల్ ప్రీత్ సింగ్) ముందుకు వస్తుంది.ఈ క్రమంలో ఆదిత్యకు సంబంధించిన కొన్ని అవాక్కయ్యే అంశాలను శృతి తెలుసుకుంటుంది.మరి నిజంగానే ఆదిత్య ఏదైనా నేరం చేశాడా? అతడికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌లో ఎలాంటి ట్విస్టు ఉంది? ఆదిత్య కేసును శృతి గెలుస్తుందా లేదా? అనే అంశాలు ఈ సినిమా కథలో మనం చూడొచ్చు.

విశ్లేషణ:

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించే చిత్రాల్లో కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు అంటుంటాయి.ఈ క్రమంలోనే అతడు తెరకెక్కించిన చెక్ చిత్రం చదరంగం నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు.

అతడికి ఉరిశిక్ష పడ్డ కారణాలు, వాటిని అతడు ఎదుర్కొన్న విధానం దర్శకుడు అద్భుతంగా చూపించాడు.ఇక ఫస్టాఫ్‌లో నితిన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్, అతడి ప్రేమకు సంబంధించిన సీన్స్‌ను మనకు చూపించారు.

ఇక జైలులో ఆదిత్యకు ఎదురయ్యే పరిస్థితులను మనకు దర్శకుడు చూపించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఇక ఓ అదిరిపోయే సీక్వెన్స్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.

కాగా సెకండాఫ్‌లో నితిన్ జైలులో ఎలాంటి ఎత్తులు వేస్తాడు, అతడికి సాయం చేసేందుకు రకుల్ ఎందుకు వస్తుంది అనే అంశాలు మనల్ని ఆకట్టుకుంటాయి.అయితే ఎవరూ ఊహించని విధంగా నితిన్ ఆడే మైండ్ గేమ్ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.

ముఖ్యంగా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులు ఊహించని విధంగా ఉండటంతో వారు నోరెళ్లబెడతారు.ఇక క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్టులు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి.

మొత్తంగా చెక్ చిత్రంలో నితిన్ వేసే ఎత్తులు, అతడు చదరంగం ఆటలో ఎలాంటి ప్రావిణ్యతను సాధించాడో మనకు అర్ధమవుతుంది.ఓవరాల్‌గా చెక్ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సె్స్ అయ్యింది.

నటీనటుల పర్ఫార్మెన్స్:

ఆదిత్య పాత్రలో నితిన్ నటన ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి.మైండ్ గేమ్ ఆడే చెస్ ప్లేయర్‌గా నితిన్ పర్ఫార్మెన్స్ సూపర్.

అతడి నుండి ఇలాంటి పర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులు అస్సలు ఊహించరు.ఇక ప్రియా వారియర్ ఈ సినిమాలో కేవలం ఫ్లా్ష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కే పరిమితం అయ్యింది.

అయినా అమ్మడు అందాల ఆరబోతతో ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతారు.ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ పర్ఫార్మెన్స్ సినిమాకు బలాన్ని చేకూరుస్తుంది.

క్యారెక్టర్ ఆర్టి్స్ట్ సాయిచంద్ పాత్ర కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.ఇక మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:

ఒక సినిమాను కేవలం కథతో నెట్టుకురావచ్చని ఇప్పటికే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ప్రూవ్ చేశాడు.ఇప్పుడు మరోసారి చెక్ చిత్రంతో చంద్రశేఖర్ ఇదే ఫార్ములాతో హిట్ కొట్టాడని చెప్పొచ్చు.

చదరంగం ఆటను బ్యాక్‌డ్రాప్‌గా చూపిస్తూ నితిన్ ఆడే మైండ్ గేమ్‌తో సినిమా కథను అదిరిపోయే రీతిలో ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించాడు.ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే.

సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాను బాగా ఎంగేజింగ్‌గా చూపెట్టింది.కాగా ఈ సినిమాలో ఇతర టెక్నీషియన్లు తమకు కేటాయించిన విభాగంలో వంద శాతం పనితనం చూపెట్టారు.

చివరగా:

చెక్ – మైండ్ గేమ్‌తో అదరగొట్టిన యేలేటి!

రేటింగ్:

3.0/5.0

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube