రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చెక్.. ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్ గతేడాది భీష్మ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా అందించిన సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టిన నితిన్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

 Nithiin Check Movie Release Date Finalized, Nithiin, Check Movie, Release Date,-TeluguStop.com

ఈ క్రమంలో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చెక్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను వైవిధ్య చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ లభించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో నితిన్ చాలా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తుండగా, ఆయన ఖైదీ పాత్రలో నటిస్తున్నట్లు ఈ పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది.

కాగా చెక్ అనే టైటిల్‌తో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎలాంటి కథనాన్ని రెడీ చేశాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఇక ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే ప్రశ్నకు తాజాగా సమాధానం కూడా దొరికింది.

ఈ సినిమాను ఫిబ్రవరి 19న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ మేరకు రిలీజ్ పోస్టర్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాలో నితిన్‌తో పాటు అందాల భామలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌లు నటిస్తున్నారు.రకుల్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం కంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ‘రంగ్ దే’ ఇంకా రిలీజ్ కాకపోవడంతో, చెక్ చిత్రం నితిన్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube