నితిన్ చెక్ మూవీ ఒటీటీ రిలీజ్ రెడీ... సన్ నెక్స్ట్ లో ప్రసారం

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం చెక్.ఈ మూవీని చెక్ బ్యాక్ డ్రాప్ లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథగా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు.

 Nithiin Check Movie Ready To Release In Digital-TeluguStop.com

చేయని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉరిశిక్షకి రెడీ అవుతున్న అతని జీవితంలో చెస్ ఎలాంటి మార్పు తీసుకొచ్చింది అనే ఎలిమెంట్ తో ఈ సినిమా కథని తనదైన స్క్రీన్ ప్లేతో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు.రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలో లాయర్ పాత్రలో నటించింది.

అలాగే వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నితిన్ జైలుకి వెళ్ళడానికి కారణం అయ్యే అమ్మాయిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.అయితే కాన్సెప్ట్ భాగానే ఉన్న థియేటర్ ప్రేక్షకులకి అనుకున్న స్థాయిలో ఈ సినిమా కనెక్ట్ కాలేదు.

 Nithiin Check Movie Ready To Release In Digital-నితిన్ చెక్ మూవీ ఒటీటీ రిలీజ్ రెడీ… సన్ నెక్స్ట్ లో ప్రసారం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భీష్మ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ రోల్ లో చూసిన ప్రేక్షకులు చెక్ సినిమాలో సీరియస్ పాత్రలో నితిన్ ని చూడలేకపోయారు.ఈ కారణంగానే సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది.

దానికి తోడు కరోనా సిచువేషన్స్ కూడా ప్రేక్షకులని థియేటర్స్ కి రాకుండా చేశాయి.అయితే ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకి నచ్చే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో ఈ మూవీడిజిటల్ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది.సన్ నెక్స్ట్ ఒటీటీ ఛానల్ లో ఈ మూవీ మే 14 నుంచి టెలికాస్ట్ కాబోతుంది.

ఈ విషయాన్ని తాజాగా ఎనౌన్స్ చేశారు.నితిన్ కెరియర్ లో డిఫరెంట్ కథాంశంతో చేసిన ఈ సినిమాలు వర్క్ అవుట్ కావడం లేదు.

గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన లై మూవీ కూడా క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.అది కూడా అలాగే డిజాస్టర్ అయ్యింది.

మరి చెక్ మూవీ కూడా అదే కోవలో చేరిపోయింది.మరి డిజిటల్ ప్రేక్షకులు అయినా ఈ సినిమాని ఆధారిస్తారేమో చూడాలి.

#NithiinCheck #SunNext OTT #Digital

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు