మరో ట్రీట్‌తో చెక్ పెడుతున్న హీరో

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగ్‌దే’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని నితిన్ చూస్తున్నాడు.

 Nithiin Check Movie First Glimpse On Jan 3, Nithiin, Check, Chandra Sekhar Yelet-TeluguStop.com

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని శరవేగంగా రెడీ చేస్తున్నాడు ఈ హీరో.విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నితిన్ నటిస్తున్నాడు.

కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.తాజాగా నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా నుండి మరో కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్‌లో ఖైదీ డ్రెస్‌లో ఉన్న నితిన్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు.ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నటిస్తున్నాడు.కాగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్, అతడిని కాపాడేందుకు ప్రయత్నించే లాయర్ పాత్రలో నటిస్తుంది.ఇక వింక్ బ్యూటీ ప్రియా వారియర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను జనవరి 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.కోర్టురుమ్‌లో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నితిన్ చదరంగం ఆటగాడిగా కనిపిస్తాడు.

మరి చెక్ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో తెలియాలంటే మరొకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి రంగ్‌దే చిత్రం కంటే ముందే ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేక ఆ సినిమా తరువాత రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.ఏదేమైనా బ్యాక్‌టుబ్యాక్ చిత్రాలను లైన్‌లో పెట్టిన నితిన్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube