వచ్చే నెలలో పెళ్లికి సిద్ధం అవుతున్న నితిన్

యంగ్ హీరో నితిన్ తాజాగా భీష్మ సినిమాతో మళ్ళీ సూపర్ హిట్ కొట్టి ఫాంలోకి వచ్చాడు.ఇదే స్పీడ్ లో ఏకంగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టేసాడు.

 Nithiin And Shalini Prepone Their Wedding In July, Tollywood, South Cinema, Telu-TeluguStop.com

అయితే ఇంతలో తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు.తన ప్రేమ విషయం, పెళ్లి చేసుకుంటున్న విషయం చెప్పడంతో పాటు అమ్మాయిని కూడా పరిచయం చేశాడు.

షాలినితో చాలాకాలంగా ప్రేమ‌లో ఉన్నట్లు తెలిపాడు.ఇక పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 15న హైద‌రాబాద్‌లో వీరి నిశ్చితార్థం కూడా అయిపొయింది.

ఏప్రిల్‌లో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకొని డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు.దుబాయ్ లో ఏప్రిల్ 16న పెళ్లి చేసుకొబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు.

ఇంతలో కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోవడంతో వీరి పెళ్లి వాయిదా పడిపోయింది.ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు.

ఈ నేపధ్యంలో వ‌చ్చే నెల‌లోనే నితిన్ వివాహానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.తొలుత‌ డిసెంబ‌ర్‌లో పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాజా స‌మాచారం ప్ర‌కారం జూలైలోనే వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌ట్లో క‌రోనా స‌మ‌స్య పరిష్కారం అయ్యే సూచ‌న‌లు లేక‌పోవ‌డంతో పెళ్లి ప‌నులు కూడా మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.కానీ ఈ సారి హైద‌రాబాద్‌ లోనే పెళ్లి వేదికని నిర్ణయించారు.

న‌గ‌ర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో నితిన్ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని టాక్.ఇక‌ ఈ విష‌యాన్ని నితిన్‌, షాలినీ కుటుంబ స‌భ్యులు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

మొత్తానికి నిఖిల్ దారిలోనే నితిన్ కూడా తొందరగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు.ఇక రానా కూడా ఇదే దారిలో పెళ్లికి సిద్ధమైపోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube