పెళ్ళైన సంవత్సరానికి రొమాంటిక్ ఫోటోలు పంచుకున్న హీరో నితిన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పలు సినిమాలతో దూసుకుపోతున్న వారిలో నితిన్ ఒకరు.ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ సినిమాగా తెరకెక్కుతున్న “మాస్ట్రో” సినిమాతో బిజీగా ఉన్నారు.

 Nithiin And Shalini Enjoy In Maldives On First Wedding Anniversary-TeluguStop.com

అయితే గత ఏడాది జూలై 26 వ తేదీన నితిన్ ఓ ఇంటివాడైన సంగతి మనకు తెలిసిందే.ఎంతో అట్టహాసంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించిన ఈ యంగ్ హీరో వివాహంపై పెట్టుకున్న కలలపై కరోనా దెబ్బ పడిందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే నితిన్ కేవలం కొంత మంది బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే తన స్నేహితురాలు షాలిని మెడలో మూడు ముళ్లు వేసి వివాహబంధంతో ఒక్కటయ్యారు.

 Nithiin And Shalini Enjoy In Maldives On First Wedding Anniversary-పెళ్ళైన సంవత్సరానికి రొమాంటిక్ ఫోటోలు పంచుకున్న హీరో నితిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే నితిన్ వివాహం జరిగి ఏడాది పూర్తయింది.

ఈ విధంగా పెళ్లైన ఒక సంవత్సరానికి నితిన్ జంట తమ రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.వీరి పెళ్లి జరిగి సంవత్సరం కావడంతో మొదటి వివాహ వార్షికోత్సవాన్ని మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే నితిన్ ఫోటోలను షేర్ చేస్తూ… నా జీవితాన్ని ఎంతో సంతోషంగా, ఆనందంగా మలిచావు.నా జీవితాంతం నీతోనే గడపాలని ఉంది అంటూ తన భార్యపై ఉన్న ప్రేమను బయట పెట్టాడు.ఈ క్రమంలోనే షాలిని స్పందిస్తూ… ఇప్పుడు.

ఎప్పుడు.ఎల్లప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ నితిన్ పై ప్రేమను కురిపించింది.

ఈ విధంగా ఈ జంట ఒకరిపై ఒకరికున్న ప్రేమను బయటకు తెలియజేస్తూ మాల్దీవులలో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు మాల్దీవులు వెళ్లిన ఈ జంటకి సంబంధించిన ఫోటోలను షాలిని సోషల్ మీడియా వేదికగా చేశారు.ఈ ఫోటోలను చూస్తుంటే నితిన్ మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటూ తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది.మొత్తానికి ఈ జంట పెళ్లయిన సంవత్సరానికి తమ రోమాంటిక్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతూ అభిమానులను ఆకట్టుకున్నాయి.

#FirstWedding #Maldives #NithinShalini #Nithin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు