నిశ్శబ్దం సినిమా అమెజాన్ కు దక్కిన అదృష్టమట!  

nishabdham is safe project for amazon prime Anushkha, Nishabddam, Nani, V, Amazon Prime, New Subscribers - Telugu Amazon Prime, Anushkha, Nani, New Subscribers, Nishabddam, V

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మార్చి నెల నాలుగో వారం నుంచి దేశంలో థియేటర్లు మూతబడ్డాయి.కేంద్రం అనుమతులతో కొన్ని రోజుల క్రితం పలు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు థియేటర్ల వైపు ఆసక్తి చూపడం లేదు.

TeluguStop.com - Nishabdham Movie Is Safe Project For Amazon Prime

కేంద్రం థియేటర్లలో 50 శాతం సీటింగ్ కు మాత్రమే అనుమతులివ్వడంతో థియేటర్లు తెరిచినా ప్రయోజనం ఉండదని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.దీంతో తెలుగు సినిమాల నిర్మాతలు ఓటీటీ వైపే చూస్తున్నారు.

అయితే నాని హీరోగా తెరకెక్కిన వి సినిమా, అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదలై ఉంటే నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చేవని కామెంట్లు వినిపించాయి.

TeluguStop.com - నిశ్శబ్దం సినిమా అమెజాన్ కు దక్కిన అదృష్టమట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే వి సినిమా వల్ల అమెజాన్ పెద్దగా లాభం పొందలేకపోయినా నిశ్శబ్దం సినిమా మాత్రం అమెజాన్ కు లాభాలే తెచ్చిపెట్టిందని సమాచారం.

నిశ్శబ్దం సినిమాకు అమెజాన్ లో భారీగా రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

కరోనా, లాక్ డౌన్ వల్ల కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో టాక్ తో పని లేకుండా నిశ్శబ్దం సినిమాను చూశారు.విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు అందించిన నిశ్శబ్దం అమెజాన్ కు కొత్త సబ్ స్క్రైబర్లు పెరగడానికి కూడా కారణమైందని తెలుస్తోంది.

అనుష్క, మాధవన్, అంజలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నిశ్శబ్దం గత నెల 2వ తేదీన విడుదలైంది.

థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా కథపరంగా బాగానే ఉన్నా కథనంలోని లోపాలు సినిమాకు మైనస్ గా మారాయి.

సినిమాలో హీరోయిన్ అనుష్క కంటే అంజలి కనిపించే సీన్లే ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వినిపించాయి.అందరూ ఫ్లాప్ అనుకుంటున్నా నిశ్శబ్దం అమెజాన్ కు మాత్రం సేఫ్ ప్రాజెక్టులా నిలవడం గమనార్హం.

దీంతో అమెజాన్ మరిన్ని కొత్త సినిమాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

#Nani #Anushkha #Nishabddam #Amazon Prime #New Subscribers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nishabdham Movie Is Safe Project For Amazon Prime Related Telugu News,Photos/Pics,Images..