నిశ్శబ్దంగా మారిన రిలీజ్ డేట్  

Nishabdam Movie Release Postponed-movie Release,nishabdam,postponed

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం ఏడాదికో సినిమా చొప్పున చేస్తూ వస్తోంది.గతేడాది భాగమతి చిత్రంతో మెప్పించిన అనుష్క సైరా నరసింహా రెడ్డి సినిమాలో గెస్ట్ రోల్ చేసింది.

Nishabdam Movie Release Postponed-Movie Nishabdam Postponed

కాగా తాజాగా నిశ్శబ్దం అనే సినిమాతో మనముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వరుస వాయిదాలతో రిలీజ్‌కు నోచుకోకుండా వస్తోంది.

కాగా నిశ్శబ్దం సినిమాను జనవరి 31న ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయాలని భావించిన చిత్ర యూనిట్, మరోసారి ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు.కాగా ఈసారి ఎందుకు వాయిదా వేశారనే విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఈ సినిమాలో అనుష్క ఓ మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తోంది.సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

మాధవన్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తుండగా, కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో స్వీటీ మరోసారి తన సత్తా చాటుతుందా లేదా అనేది చూడాలి.

ఏదేమైనా వరుస వాయిదాలతో ఈ సినిమా ఎలాంటి బజ్ లేకుండా నిశ్శబ్దంగా మారుతుందని ప్రేక్షకులు అంటున్నారు.

తాజా వార్తలు