నిశ్శబ్దంగా ఏప్రిల్ 2న వస్తున్న అనుష్క నిశ్శబ్దం....

విలక్షణ నటి అనుష్క శెట్టి ప్రస్తుతం నటిస్తున్న అటువంటి చిత్రం నిశ్శబ్దం.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 Nishabdam Movie Release On A April 2nd-TeluguStop.com

అలాగే ఈ చిత్రంలో విలక్షణ నటుడు మాధవన్, తెలుగు భామ అంజలి, హీరోయిన్ షాలిని పాండే తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ తెరకెక్కుతోంది.

అయితే తాజాగా నిశ్శబ్దం చిత్ర యూనిట్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2వ తారీఖున విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు.

అంతేగాక ఈ విషయానికి సంబంధించినటువంటి  పోస్టర్ ను కూడా విడుదల చేశారు.దీంతో అనుష్క అభిమానులు పండగ చేసుకుంటున్నారు.అయితే ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవిటి వ్యాధితో బాధ పడుతున్న టువంటి ఓ యువతి పాత్రలో నటిస్తోంది.

Telugu Nishabdam-Movie

అయితే ఎప్పుడూ విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించే అటువంటి అనుష్క ఈ సారి మరో కొత్త తరహా పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గతంలో అనుష్క నటించిన టువంటి భాగమతి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.దీంతో ఈ అమ్మడు ఈ విక్టరీని  కొనసాగించేందుకు సిద్ధపడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube