మధ్యలో వస్తారంటూ డాక్టర్ బాబు ఫైర్.. వంటలక్క సెటైర్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కార్తీక దీపం సీరియల్‌ గురించి, అందులో ఉన్న పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సీరియల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.

 Nirupam Paritala Shares Premi Viswanath From Karthika Deepam Set, Nirupam Parita-TeluguStop.com

అంతేకాకుండా సాయంత్రం అయింది అంటే చాలు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి మరి ఈ సీరియల్ మిస్ చెయ్యకుండా చూస్తూ ఉంటారు అంతలా సీరియల్ కి ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు.ఇక ఈ సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్క పేర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యాయి.

దీప, వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్.అలాగే డాక్టర్ బాబు గా , కార్తీక్‌గా నిరుపమ్ పరిటాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈ సీరియల్ లో ఇద్దరు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ ఇద్దరూ ఆఫ్ స్క్రీన్ లో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ తెగ అల్లరి చేస్తూ టిక్ టాక్ వీడియోలు తీస్తూ ఉంటారు.అంతేకాకుండా షూటింగ్ మధ్యలో దొరికే విరామ సమయంలో తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఆ మధ్య ఓ సారి ఇలానే చాక్లెట్ కోసం ఓ పోస్ట్ చేశాడు.తాను తినాలని అనుకున్న చాక్లెట్‌ను ప్రేమీ విశ్వనాథ్ తినేసిందట.అయితే తాజాగా ఇప్పుడు నిరుపమ్ ఓ పోస్ట్ చేసాడు.

మామూలుగానే తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు నిరుపమ్.తాజాగా ప్రేమీ విశ్వనాథ్ మీద సెటైర్లు వేశాడు నిరుపమ్.

తాను ఫోటో దిగుతున్న సమయంలో మధ్యలో వచ్చి ప్రేమీ విశ్వనాథ్ డిస్టర్బ్ చేస్తుంది అంటూ నిరుపమ్ పోస్ట్ చేసాడు.దీనిపై నిరుపమ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఫోటో దిగుతుంటే మధ్యలో వస్తారు.మళ్లీ ఇదేంటి ఇలా ఉందని అంటారు.

ఏంటో అసలు.దీనికి మీరు క్యాప్షన్ చెప్పండి అంటూ తన అభిమానులను అడిగేశాడు నిరుపమ్ పరిటాల.

ఇక నిరుపమ్ చేసిన ఈ పోస్ట్‌కు ప్రేమీ విశ్వనాథ్ రిప్లై ఇచ్చింది.పుష్ప సినిమాలో రష్మిక టైపులో అయ్య సామీ అని ప్రేమీ విశ్వనాథ్ కామెంట్ చేసింది.

ఇక ఈ ఇద్దరిని ఇలా చూసి జనాలు మురిసిపోతోన్నారు.అయితే కేవలం డాక్టర్ బాబు వంటలక్క మాత్రమే కాకుండా ఆ సీరియల్ టీమ్ లో అందరూ వీరిలాగే అల్లరి చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube