ఆ విషయంలో డాక్టర్ బాబుకు రిక్వెస్ట్.. స్పందించిన నిరుపమ్?

బుల్లితెర సీరియల్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నిరుపమ్.ఆయనకు బుల్లితెరలో ఎంతో ఫాలోయింగ్ ఉంది.

 Nirupam Paritala, Hitler Gari Pellam, Doctor Babu, Karthika Deepam-TeluguStop.com

అంతేకాకుండా ఆయన నటిస్తున్న కార్తీకదీపం సీరియల్ లో కూడా డాక్టర్ బాబు గా ఎంతోమంది నోళ్లలో ఉన్నాడని చెప్పవచ్చు.ఇదిలా ఉంటే డాక్టర్ బాబు కు అభిమానుల నుండి ఓ చిన్న రిక్వెస్ట్ వచ్చింది.

వెంటనే అభిమానుల రిక్వెస్ట్ ని స్పందించాడు.ఇంతకీ అదేంటంటే.


జీ తెలుగులో ప్రసారం అవుతున్న హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.గత ఏడాది నుండి ప్రసారమౌతున్న ఈ సీరియల్ కు అభిమానులు బాగానే ఉన్నారు.

ఇందులో నిరుపమ్ పరిటాల, గోమతి ప్రియా నటీనటులుగా నటిస్తున్నారు.ఇందులో ఎప్పుడు రూల్స్ పెడుతూ, పనిష్మెంట్స్ ఇస్తూ మొత్తానికి హిట్లర్ గా మారుతాడు నిరూపమ్.

ఇక ఆయన భార్య పాత్రలో నటిస్తున్న గోమతి ప్రియా గడసరిగా కనిపిస్తుంది.ఇక ఈ సీరియల్ సా.6.30 కు ప్రసారమవుతుంది.


దీంతో ఈ సీరియల్ అభిమానులు సాయంత్రం టైంలో కాకుండా అందరూ చూసేలా రాత్రి సమయాల్లో ప్రసారం చేయాలని తెగ రిక్వెస్ట్ లు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ సీరియల్ టైమింగ్ మార్చాలని అభిమానులు నిరుపం పరిటాల ను కోరగా ఆయన వెంటనే స్పందించారు.మా అభిమాన సీరియల్ హిట్లర్ గారి పెళ్ళాం సాయంత్రం 6 గంటల నుంచి అందరూ చూసే విధంగా రాత్రి సమయానికి మార్చాలని జీ తెలుగు వారిని కోరుతున్నాము అంటూ నిరూపమ్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.


దీంతో నిరూపమ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ.

తప్పకుండా మీ రిక్వెస్ట్ పై జీ తెలుగు ఛానల్ అఫీషియల్ చర్చిస్తారు.మీరు ఆశించినట్లే జరుగుతుందని అనుకుంటున్నాము అంటూ స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube