యూట్యూబ్‌లో దూసుకుపోతున్న డాక్టర్ బాబు.. వారం రోజుల్లోనే ఆ రికార్డు?

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ తో డాక్టర్ బాబుగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు నిరుపమ్ పరిటాల.అంతేకాకుండా బుల్లితెర స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

 Nirupam Paritala, Manjula, Youtube Channel, Karthika Deepam,latest News Social M-TeluguStop.com

ఎన్నో సీరియళ్ళలో నటించిన ఈయన ఈ సీరియల్ తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇక ఈయన మరో బుల్లితెర నటి మంజులను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే యూట్యూబ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు డాక్టర్ బాబు.

ఈ మధ్య ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో తమ పేరు పై ఛానల్స్ క్రియేట్ చేసుకొని తమ విషయాలను బాగా షేర్ చేసుకుంటున్నారు.

సెలబ్రిటీలు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక వీడియోను అప్ లోడ్ చేస్తూనే ఉన్నారు.ఇక నిరుపమ్ కూడా ఈ మధ్యనే యూట్యూబ్ లో తన పేరు తన భార్య పేరు కలిపి ఓ ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు.

అందులో తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటున్నారు.

Telugu Karthika Deepam, Manjula, Youtube Channel-Movie

ఇటీవలే తన భార్యకు కారు గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాడు నిరుపమ్.ఇదిలా ఉంటే కార్తీకదీపం సీరియల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నిరుపమ్.తన సోషల్ మీడియాలో కూడా విపరితమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటాడు.తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతుంటాడు.

ఇక యూట్యూబ్ ను కూడా ప్రారంభించి వారం రోజులు కాగా అంతలోనే ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా లక్షకు మించి సబ్ స్క్రై బర్ లను సొంతం చేసుకున్నాడు.

ఈయన షేర్ చేసే వీడియోలను కూడా ఎంతోమంది వీక్షిస్తారు.యూట్యూబ్ ఛానల్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న డాక్టర్ బాబు వారం రోజుల్లోనే మంచి రికార్డు సంపాదించుకున్నాడు.

అభిమానులు కూడా మరిన్ని విషయాలను తమతో పంచుకోమని తెగ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube