వ్యాక్సిన్ల పై జిఎస్టి ధరలను అదుపులో ఉంచేందుకే..!

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలిసిందే.కేసులు పెరగడం.

 Nirmala Sitharaman Replied Gst For Vaccine Covid Drugs-TeluguStop.com

బెడ్లు, ఆక్సిజన్ లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాయి.

అయితే ఆక్సిజన్, వ్యాక్సిన్ లపై పన్ను రద్దు చేయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి లేక రాశారు.దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

 Nirmala Sitharaman Replied Gst For Vaccine Covid Drugs-వ్యాక్సిన్ల పై జిఎస్టి ధరలను అదుపులో ఉంచేందుకే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ్యాక్సిన్ పై 5%, ఆక్సిజన్, మెడికల్స్ పై 12% జి.ఎస్.టీ కేవలం ధరలను అదుపులో ఉంచేందుకు మాత్రమే విధిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.వీటిపై జి.ఎస్.టి ఎందుకు అన్నది వరుస ట్వీట్లు పెట్టారు నిర్మలా సీతారామన్.

వాటిని జిఎస్టి నుండి మినహాయిస్తే దేశీయ తయారీ దారులు వాటి ధరలను పెంచేస్తారన .ముడిపదార్ధాలు, సేవలను చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక ధరలు పెంచే అవకాశం ఉందని ఆమె అన్నారు.అలా ధరలను పెంచితే వినియోగదారుల మీద మరింత భారం పడుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.రెం డెసివిర్ ఇంజక్షన్లు, దాని ముడి పదార్ధాల పై ఇంపోర్ట్ ఫీస్, ఐ.జి.ఎస్.టీని తగ్గించినట్టు వెల్లడించారు.45 సంవత్సరాలు పై బడిన వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తుందని.దానికి కేంద్రమే పన్ను చెల్లిస్తుందని అన్నారు.

#Vaccine #COvid #Corona #Drugs #Narendra Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు